Politics

కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని ప్రత్యక్షంగా చూశాను

కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని ప్రత్యక్షంగా చూశాను

బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.నేడు ఆయన మేడిగడ్డకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ప్రత్యక్షంగా చూశానన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటేనని రాహుల్ అన్నారు. ఆ పార్టీలన్నీ బీఆర్ఎస్‌కు అనుకూలంగానే పని చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీకు ఇచ్చిన హామీలు నెరవేరస్తామన్నారు. దొరల సర్కారును పారదోలి ప్రజల సర్కార్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నానని రాహుల్ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z