Devotional

ఈ రాశి వారు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు-రాశిఫలాలు

ఈ రాశి వారు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు-రాశిఫలాలు

మేషం

చేపట్టిన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలున్నా పట్టుదలగా పూర్తి చేస్తారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ, ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో దూసుకు పోతారు. విదేశాల నుంచి ఆశిం చిన సమాచారం అందుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సతీమణిని తరచూ సంప్రదించడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల ఇబ్బంది పడతారు.

వృషభం

రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా మారుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగావకాశాలు బాగా మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది.

మిథునం

సామాజికంగా హోదా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో, ముఖ్యంగా రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ ఉంటుంది. వృత్తి, వ్యాపా రాల్లో సరికొత్త ఆలోచనలను, వ్యూహాలను ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ హామీలు ఉండ వద్దు.

కర్కాటకం

మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనల్ని అంతా గౌరవిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు రాణిస్తాయి. మీ సలహాలు, సూచనలు అధికారులకు నచ్చుతాయి. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. స్వల్ప అనారోగ్య సమస్య లున్నా పట్టుదలగా అత్యవసర వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడ తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి. ఎవరికీ గుడ్డిగా నమ్మ వద్దు.

సింహం

ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యవహార జయం ఉంటుంది. రావాల్సిన డబ్బు వసూలు అవుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి.

కన్య

ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉండడం, అవసరానికి డబ్బు అందడం, రావాల్సిన డబ్బును వసూలు చేసుకోవడం, ఆర్థిక సమస్యలు తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. సన్నిహితుల సహాయంతో ఇంటా బయటా కొన్ని ముఖ్యమైన సమస్య లను పరిష్కరించుకుంటారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుకుంటారు. తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

తుల

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులలో కార్య సిద్ధి కలుగుతుంది. ఇంటా బయటా ఏ పని తలపెట్టినా అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. బంధువుల నుంచి విలువైన సమాచారం అందు తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం

ఇబ్బందులున్నప్పటికీ కొన్ని ఆదాయ ప్రయత్నాలను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అను కూలంగా ఉండడంతో పాటు, వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అద నపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు చవి చూస్తారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. సతీమణికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది.

ధనుస్సు

రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరు తాయి. ఏ కార్యం తలపెట్టినా అనుకూలంగా సాగిపోతుంది. అనుకోకుండా కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవడం జరుగుతుంది.

మకరం

ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టడం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థిక విషయాలలో ఎవరికీ వాగ్దానాలు చేయక పోవడం మంచిది. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం

ఇష్టమైన బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపా రాలు ఆశాజనకంగా సాగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల సహా యంతో కొన్ని వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు పూర్తి అవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవ కాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

మీనం

ప్రయత్నాలన్నీ చాలావరకు కలిసి వస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు. ఆర్థిక విషయాలకు సంబంధించిన ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. ఏలిన్నాటి శని కారణంగా ఇంటా బయటా ఒత్తిడి ఉండడం, శుభ కార్యాల మీద బాగా ఖర్చు కావడం జరుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకపోవడం మంచిది. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z