జపాన్ తెలుగు ఫెడరేషన్ (జేటీఎస్) ఆధ్వర్యంలో వనభోజనం నిర్వహించారు. టోక్యోలోని కొమట్సుగావా పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు సహా 150 మందికి పైగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకే అందరూ ఒకే చోట చేరి రోజంతా ఆటలతో బిజీబిజీగా గడిపారు. సంఘంలో కొత్త సభ్యులు పరిచయం అయ్యారు. ఈ సందర్భంగా వారంతా టోక్యోతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం జేటీఎస్ వాలంటీర్లు చిన్నారులందరికీ ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించారు.స్వచ్ఛంద సేవ అనే ప్రాథమిక సూత్రంపై జపాన్ తెలుగు సమాఖ్య కృషి చేస్తోందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా పాటిస్తానని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో సహకార స్ఫూర్తి పెరుగుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గతంలో స్వచ్ఛందంగా సేవలందించిన వారిని సన్మానించడమే కాకుండా ప్రస్తుత వాలంటీర్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరినీ జేటీఎస్ కమిటీ అభినందించింది
👉 – Please join our whatsapp channel here –