Devotional

వార ఫలాలు-(5-11-2023 నుండి 11-11-2023)

వార ఫలాలు-(5-11-2023  నుండి 11-11-2023)

మేషం

శుభ గ్రహాల అనుకూలత కాస్తంత ఎక్కువగానే ఉంది. అందువల్ల సమయం చాలావరకు కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలం గానే కాక, గౌరవప్రదంగా కూడా ఉంటాయి. ఇష్టమైన వ్యక్తుల నుంచి మంచి కబుర్లు వింటారు. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. తలపెట్టిన పనులు, పెండింగ్ పనులు సజావుగా సాగి పోతాయి. వృత్తి, ఉద్యోగాలు మంచి మలుపు తిరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడించే అవకాశం ఉంది. భక్తి భావాలు పెరుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభ సమాచారం అందుకుంటారు. కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులు అప్రయత్నంగా మంచి అవకాశాలు అందుకుంటారు.

వృషభం

రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం, రవి కుజులు షష్ట స్థానంలో ఉండడం వల్ల, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ఆలోచనలు సఫలం అవుతాయి. ప్రతిభా పాటవాలు వృద్ధి చెందుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా ఫలిస్తుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులు బాగా సన్నిహితులవుతారు. విందు కార్యక్రమంలో పాల్గొంటారు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నా లకు మంచి స్పందన లభిస్తుంది. వృత్తి జీవితంలో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. సరికొత్త పరిచ యాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు వేగంగా, ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది.

మిథునం

లాభ స్థానంలో గురువు, పంచమ స్థానంలో రవి, బుధులు మంచి యోగానికి దారితీస్తాయి. ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా, ప్రశాంతంగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల డబ్బు నష్టం తప్ప ఫలితం ఉండకపోవచ్చు. శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. అదనపు ఆదాయ మార్గాలు బాగా సానుకూలంగా ఉంటాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

కర్కాటకం

నాలుగవ స్థానంలో ఉన్న శుభ గ్రహాల వల్ల మంచి శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అష్టమ శని, దశమ గురువు పని భారాన్ని గానీ, బరువు బాధ్యతలను గానీ బాగా పెంచే అవ కాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను, ముఖ్యమైన కుటుంబ సమస్యలను పరిష్క రించుకునే సూచనలున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడం మంచిది. బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. సతీమణికి కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

సింహం

గురు, రవి, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ప్రధాన సమస్యలు, ఒత్తిళ్లు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్య తల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే, ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ మంచిది కాదు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవి తంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కన్య

ఆరవ స్థానంలో శనీశ్వరుడు కొండంత అండగా ఉంటాడు. ధన స్థానంలో ఉన్న రవి, బుధుల వల్ల ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి జీవితం సానుకూల మలుపు తిరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలకు లోటు ఉండదు. పెద్దల సలహాలు, సూచనలతో వ్యక్తిగత, కుటుంబ సమస్యలను కొంత మేరకు పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. బంధువుల్లో కొందరు అపనిందలు వేయడం గానీ, దుష్ప్రచారం చేయడం గానీ జరుగుతుంది. సతీమణికి సమయం బాగా అనుకూలంగా ఉంది.

తుల

గురువు, రవి, బుధ, కుజ, రాహు గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ, రాశ్యధిపతి వ్యయ స్థానంలో నీచబడి ఉన్నందువల్ల ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుంది. కష్టార్జి తంలో ఎక్కువ భాగం వృథా అయిపోతూ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి కానీ, అనవసర ఖర్చుల మీద అదుపు ఉండదు. విలాసాల మీద ఎక్కువగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు ఎదురుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది. కొందరు సన్నిహితు లతో కలిసి వృత్తి, వ్యాపారాలను విస్తరించాలనే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో లాభాలకు కొరత ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. సతీమణితో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

వృశ్చికం

లాభ స్థానంలో శుక్ర, కేతువుల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా కొద్దిగానైనా పురోగతి ఉంటుంది. వ్యయస్థానంలో రాశ్యధిపతి కుజుడు ఉండడం, రవి, బుధులతో కలిసి ఉండడం వంటివి ఏ పనినీ ఒక పట్టాన ముందుకు సాగనివ్వవు. ప్రయత్న లోపం బాగా ఉంటుంది. అయితే, కొద్దిగా ఆలస్యంగానైనా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు బరువు బాధ్యతలు పెంచే అవకాశం ఉంది. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతున్నప్పటికీ ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశిం చిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసు కుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది.

ధనుస్సు

శని, గురువులతో పాటు, రవి, బుధ, కుజులు కూడా బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఎటు వంటి ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. మీ ఆలోచలు, మీ పథకాలకు ఆశించిన స్పందన లభి స్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ప్రయోజనాలను ఇస్తాయి. చిన్ననాటి స్నేహితులతో విందుల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు సాను కూలంగా పురోగతి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవ కార్యాల్లో, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. కొందరు మిత్రులకు సాయం చేస్తారు.

మకరం

ధన స్థానంలో శనీశ్వరుడు, ఉద్యోగ స్థానంలో రవి, కుజ గ్రహాలు సంచారం చేయడం వల్ల ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆశలు వదులుకున్న సొమ్ము కూడా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు కూడా వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఇంటా బయటా పలుకుబడి పెరుగు తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. ఒకటి రెండు ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి మించి చేతిలో డబ్బుండే అవ కాశం ఉంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

కుంభం

ఏలిన్నాటి శని ప్రభావం వల్ల, ధన స్థానంలో రాహువు ప్రవేశించడం వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. ఉపయోగించుకుని వదిలేసేవారు ఎక్కువవుతారు. ముఖ్యంగా ఉద్యోగంలో అధికారులు ఎక్కువగానే ఉపయోగించుకుంటారు. ప్రస్తుతానికి సమయం అనుకూలంగా లేనం దువల్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. మధ్య మధ్య కుటుంబ సంబంధమైన ఇబ్బందులు, అనారోగ్యాలు తప్పకపోవచ్చు. అయితే, వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఉండడం, పిల్లలు వృద్ధిలోకి రావడం చాలావరకు మన శ్శాంతినిచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకునే సూచనలున్నాయి.

మీనం

గురు గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితికి, వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు ఇబ్బందేమీ ఉండదు. కొందరు బంధుమిత్రుల నుంచి ఆర్థికపరంగా ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉన్నందువల్ల పట్టుదలగా ప్రయత్నాలు కొనసాగించడం మంచిది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపా రంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. బంధు వుల నుంచి, పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవు తాయి. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. భక్తి భావాలు పెరిగి, ఆలయాలు సందర్శించడం, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం వంటివి జరుగుతాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z