తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఇంకా పెద్దగా పుంజుకోలేదని తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే మూడు అభ్యర్థుల జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. వారంతా ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కావడంతో.. అభ్యర్థులు గేరు మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో..కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అయితే నామినేషన్ దాఖలు చేసిన తర్వాత టాప్ గేర్ లో పెట్టనున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమార్ ఈ నెల 6వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. మరుసటి రోజు నుంచి కరీంనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్ర కరీంనగర్ పట్టణం నుంచి ప్రారంభమవుతుందని శ్రేణు చెప్పారు. ఒకవైపు కరీంనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసేందుకు బండి సంజయ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా.. ఈ సుడిగాలి పర్యటన 8న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల పర్యటనతో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. బుల్లెట్ ప్రూఫ్ కారు భద్రతలో బండి సంజయ్ ప్రచారం..!
👉 – Please join our whatsapp channel here –