తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం అని ఆ పార్టీ ఎన్నారై బహ్రెయిన్ శాఖ తేల్చి చెప్పింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లి ప్రచారం చేయాలని బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ ప్రత్యేక సమావేశంలో నిర్ణయించారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ దేశంలో ఉండే తెలంగాణ బిడ్డలను, ప్రజల కష్టాలను పట్టించుకోలేదని బీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారాపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్ ఆరోపించారు. తెలంగాణ బిడ్డలు గల్ఫ్ దేశాలకు పోవడానికి కారణం కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలను తగ్గించాలంటూ సర్కులర్లలు జారీ చేసింది బీజేపీ ప్రభుత్వం కదా? అని ప్రశ్నించారు.
ప్రపంచంలో తెలంగాణ ప్రజలు ఎక్కడ వున్నా వారిని కడుపులో పెట్టుకొని చూసుకునేది సీఎం కేసీఆరేనని బీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారాపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్ పేర్కొన్నారు. 60 ఏండ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని, తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపారన్నారు. బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ ఆధ్వర్యంలో గల్ఫ్ కుటుంబాల క్యాంపులకు వెళ్లి ఎన్నికల ప్రత్యేక ప్రచారం చేశారు.
గల్ఫ్ లో తెలంగాణ వాసులను ఎవరిని అడిగిన కేసీఆర్ ప్రకటించిన ప్రజా మేనిఫెస్టో ఆచరణాత్మకంగా, విశ్వసనీయంగా ఉందని బీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్ చెప్పారు. కేవలం తెలంగాణ ప్రజలే కాక ప్రపంచ వ్యాప్త తెలంగాణ బిడ్డలు సైతం హర్షిస్తున్నారనిచెప్పారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని, దేశానికే ఆదర్శమన్నారు.
బీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ ప్రధాన కార్యదర్శులు పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్ కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, సంగేపోలు దేవన్న మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము లేక బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులు చేయడం ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. పచ్చటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నెత్తుటి రాజకీయాలను ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ ఖండించింది. స్వేచ్ఛాయుతా వాతావరణంలో ఎన్నికలు జరుగాలన్నారు. దాడి ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా సరైన పద్ధతి కాదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణను ఆగం కానివొద్దన్నారు. హింసా రాజకీయాలకు పాల్పడే పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీలు కుటిల రాజకీయాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ ఆరోపించింది. ఎన్నికల్లో నాలుగు ఓట్ల కోసం నీచమైన రాజకీయాలు చేస్తున్నారని పేర్కొంది. ప్రజల్లో ఆదరణ కరువై, ప్రజల్లో సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్మూ ధైర్యం లేక ప్రతి పక్షాలు ఏంచేయాలో అర్థం కాక ప్రజల్లో అపోహలను పెంచి , విద్వేషాలు రగిలించి ఓట్లు దండుకునేందుకు తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయని రాధారాపు సతీశ్ కుమార్, వెంకటేశ్ బొలిశెట్టి, పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, చెన్నమనేని రాజేందర్, సంగేపోలు దేవన్న ఆరోపించారు. వీరి కుట్రలను మరోసారి తిప్పి కొట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు
👉 – Please join our whatsapp channel here –