బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేడు నాలుగు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్రలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మక్తల్ లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేటలో రాజేందర్ రెడ్డికి మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఇందుకోసం మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ బయలు దేరుతారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర 30న జరుగనుండగా.. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అయితే.. ఎన్నికలకు 24 రోజుల సమయం ఉండటంతో.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారం లో దూకుడు పెంచారు. రోజుకు 4 బహిరంగ సభల్లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు.
https://newslinetelugu.com/telugu-news/telangana_news/revanth-and-sanjay-naminations-78347?infinitescroll=1