కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే పూర్తిగా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ముదిగొండ మండలం యడవల్లిలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1360 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకుని మ్యానిఫెస్టోలో పొందు పరిచామని భట్టి పేర్కొన్నారు. మధిర నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. మధిర నియోజకవర్గానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చానన్నారు. ప్రభుత్వంతో పోరాడితేనే మధిర నియోజకవర్గానికి దళిత బంధు వచ్చిందన్నారు. దొరల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ప్రభుత్వం తెచ్చుకుందామన్నారు. ప్రజలే పాలకులు కావాలని భట్టి పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –