Politics

కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా

కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా

ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 6కు వాయిదా వేసింది. దీంతో సోమవారం ఏపీ హైకోర్టు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది సలీం వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు శ్రీనివాసరావుకు బెయిల్ రాలేదు. కోడికత్తి ఘటన జరిగినప్పటి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు సైతం శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సీజేఐకు సైతం లేఖ రాసిన సంగతి తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z