Devotional

నేటి దినఫలాలు-08-10-2023

నేటి దినఫలాలు-08-10-2023

మేషం

సమయం బాగా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా గురు, శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన చిక్కులు, సమ స్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు నిదానంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు ఉంటాయి.

వృషభం

పంచమంలో రాశ్యధిపతి శుక్రుడు, సప్తమ స్థానంలో బుధుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది.

మిథునం

గురు, రవి, కుజ గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాలి. దూరపు బంధువుల నుంచి సానుకూల సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి సానుకూలపడుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

కర్కాటకం

రవి, కుజ, శుక్ర గ్రహాలు భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తి, ఉద్యోగాలు బాగా అను కూలంగా ఉంటాయి. ఉద్యోగంలో కొత్త కార్యక్రమాలు, బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవా లేదు.

సింహం

భాగ్య స్థానం నుంచి గురువు వీక్షిస్తున్నందువల్ల వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ముందుకు దూసుకుపోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలకు అవకాశం ఉంది. కొత్తగా ఇల్లు కొనడం మీద దృష్టి పెడతారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వల్ల బాగా లబ్ధి పొందుతారు. ఆరోగ్యం సజా వుగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య

ఈ రాశిలో సంచరిస్తున్న శుభగ్రహం శుక్రాచార్యుడి వల్ల ఈ రాశివారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ ఆర్థిక స్థిరత్వాలకు సమస్య ఉండదు. అయితే, శుక్రుడితో ఉన్న కేతువు వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలు, వృత్తి, ఉద్యోగాల్లో మధ్య మధ్య చిరాకులు తప్పకపోవచ్చు. శని అనుగ్రహం పూర్తిగా ఉన్నందువల్ల ఆదాయపరంగా, ఉద్యోగపరంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగా వకాశాలు కలిసి వస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి.

తుల

ధన స్థానంలో బుధుడు, రాశిలో కుజ, రవుల సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో మీ విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి.

వృశ్చికం

లాభ స్థానంలో శుక్రుడు, రాశిలో బుధ సంచారం వల్ల ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బరువు బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. అనుకోకుండా కొన్ని మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ధనుస్సు

రాశ్యధిపతి అయిన గురు బలం బాగా ఉన్నందువల్ల సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీ సంబం ధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సతీమణితో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

మకరం

ధన స్థానంలో శనీశ్వరుడు, దశమ స్థానంలో రవి, కుజులు, లాభ స్థానంలో బుధుడి సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యో గంలో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో ముందుకు వెడతాయి. భాగ్య స్థానంలో ఉన్న శని వల్ల విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీ సంబంధ మైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

కుంభం

ఏలిన్నాటి శని ప్రభావం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఇతరుల పనుల కన్నా సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం విషయం ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు పరి ష్కారం అవుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలకు అను కూలంగా ఉంటాయి. ఇతరులకు సాయం చేయడం, దైవ కార్యాల్లో పాల్గొనడం వంటివి జరుగు తాయి.

మీనం

ధన స్థానంలో గురువు, భాగ్య స్థానంలో బుధుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ఆర్థిక ప్రయోజనం కలిగిస్తాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగావకాశాలు అందివస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువులకు సహాయం చేస్తారు. ఉద్యోగపరంగా విదేశాల నుంచి శుభవార్త అందుతుంది.