విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముసాయిదా ఓటరు జాబితాలో వింత చోటు చేసుకుంది. జాబితాలో చెట్టుకు ఓటు హక్కు కల్పించినట్లు పేర్కొన్నారు. అజిత్‌సింగ్‌నగర్ 58వ డివిజన్ 3వ బ్లాక్‌లోని ఓటర్లకు బూత్ నంబరు 44 కేటాయించారు. సీరియల్ నంబరు 413తో ఉన్న ఓటరు వివరాల్లో పూర్తిగా తప్పులు నమోదయ్యాయి. ఫొటో స్థానంలో చెట్టు చిత్రం ఉంది. ఓటరు ‘స్త్రీ’గాను, పేరు కాలమ్‌లో ‘జిథిజె ఘష్ట’ అని ముద్రించారు. తండ్రి పేరు స్థానంలో ‘బికేజు8’ అనే పేరుతో ‘టీఎంవో 1719012’ నంబరుతో ఓటరు కార్డు సిద్ధమైంది. ఈ చెట్టుకు.. అజిత్‌సింగ్‌నగర్ వివేకానంద సెంటినరీ స్కూలులో పశ్చిమం వైపు మొదటి గదిని పోలింగ్ కేంద్రంగా కేటాయించారు. ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌లో పరిశీలిస్తే.. ఈ తరహా తప్పులే ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న వారు చెట్టుకు ఓటు రావడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –