Politics

మరోసారి హైదరాబాద్​కు మోదీ

మరోసారి హైదరాబాద్​కు మోదీ

తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ బీసీ ఆత్మగౌరవ సభతో ప్రచారంలో మరింత జోష్ పెంచారు రాష్ట్ర నేతలు. ఈ నేపథ్యంలో మరోసారి మోదీ హైదరాబాద్​కు రానున్నారు. ఈనెల 11వ తేదీన సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో పాల్గొననున్నారు. విశ్వరూప సభ అనంతరం తిరిగి దిల్లీకి వెళ్లనున్నారు.మరోవైపు రాష్ట్రంలో ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. పార్టీ కీలక నేతలు, బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు రాష్ట్రానికి రానున్నారు. బహిరంగ సభలు, ప్రచారాల్లో పాల్గొని తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేసేందుకు కృషి చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 17, 19, 24, 26, 28వ తేదీల్లో అయిదు రోజుల పాటు రాష్ట్రంలోని బహిరంగ సభల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా కూడా 19, 24, 25, 27, 28 తేదీల్లో తెలంగాణలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z