Business

అమెజాన్ వ్యవస్థాపకుడు అద్భుతమైన ఆఫర్-వాణిజ్య వార్తలు

అమెజాన్ వ్యవస్థాపకుడు అద్భుతమైన ఆఫర్-వాణిజ్య వార్తలు

అమెజాన్ వ్యవస్థాపకుడు అద్భుతమైన ఆఫర్

ఈ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ ఫౌండర్ ‘జెఫ్ బెజోస్’ (Jeff Bezos) తమ కంపెనీలో ఉద్యోగం మానేయాలనుకునే వారికి 5000 డాలర్లు ఆఫర్ చేస్తూ ఓ సంచలన ప్రకటన చేశారు. ఊహూ… సంస్థకు ఉపయోగడరని భావిస్తున్న ఉద్యోగులను వదిలించుకునేందుకు కాదీ ప్రకటన. ఉద్యోగుల్లో సంస్థపట్ల ఎంతమందికి విధేయత కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు వేసిన ఎత్తుగడ. అదెలాగంటరా… ? చదివేయండి.ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన అమెజాన్ ఈ రోజు ఈ కామర్స్ విభాగంలో తిరుగులేని కంపెనీగా అవతరించింది. యజమాని జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా మారాడు. అసాధారణ నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న బెజోస్ 2014లో మంచి కెరీర్ను నిర్మించుకోవాలనుకనే వారికి, కంపెనీ పట్ల విధేయత కలిగినవారి కోసం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. ప్రారంభంలో ఈ ఆఫర్ కింద స్వచ్చందంగా జాబ్ వదిలేసేవారికి 2000 డాలర్లు ఇస్తామని ప్రకటించారు, ఆ తరువాత ఈ మొత్తాన్ని 3000 డాలర్లకు పెంచారు, ఇప్పుడు అది 5000 డాలర్లకు చేరింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ నాలుగు లక్షల రూపాయల కంటే ఎక్కువ.ఈ ఆఫర్ ప్రకటించిన సందర్భంగా ‘Please Don’t Take This Offer’ అని కోరడం విశేషం. సంస్థలో అందరూ ఉండాలని, ఈ ఆఫర్ ఎవరూ స్వీకరించరని భావిస్తున్నట్లు జెఫ్ బెజోస్ ప్రస్తావించారు. ఇలాంటి ఆఫర్ లాస్ ఏంజెలస్కు చెందిన ఆన్లైన్ రిటైలర్ ‘జప్పోస్’ మొదట ప్రారంభించింది. ఆ తరువాత బెజోస్ మొదలుపెట్టారు.

ఆన్‌లైన్ చాట్ ప్లాట్‌ఫాం ఒమెగ‌ల్ షట్ డౌన్

స‌మ‌స్య‌ల‌తో స‌హ‌వాసం చేస్తూ 14 ఏండ్ల ప్ర‌స్ధానం అనంత‌రం ప్ర‌ముఖ ఆన్‌లైన్ చాట్ ప్లాట్‌ఫాం ఒమెగ‌ల్ (Omegle ShutDown) మూత‌ప‌డింది. చిన్నారుల‌తో సంభాషించేందుకు పెడోఫిలిస్ వాడుతోంద‌నే ఆరోప‌ణ‌లు ఒమెగ‌ల్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పెడోఫిలిస్ ఈ సైట్‌ను టూల్‌గా వాడుతున్న‌ద‌నే అనుమానంతో ప‌లు దేశాల్లోని ప్ర‌భుత్వ ఏజెన్సీలు నిఘా పెట్టాయి. ఎన్నో కేసుల్లోనూ ప‌రిశోధ‌న సాగుతుండ‌టం నిర్వాహ‌కుల‌ను క‌ల‌వ‌ర‌పరిచింది.ఈ వెబ్‌సైట్‌ను ఇక ఎంతోకాలం న‌డిపే ఆర్ధిక స్ధోమ‌త‌, మాన‌సిక భారాన్ని త‌ట్టుకునే సామ‌ర్ధ్యం త‌న‌కు లేవ‌ని ఒమెగ‌ల్ మూసివేత నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తూ వ్య‌వ‌స్ధాప‌కుడు లీఫ్ కే బ్రూక్స్ చేతులెత్తేశారు. ఒమెగ‌ల్‌ను నిర్వ‌హిస్తూ ఇప్ప‌టికే ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఖ‌ర్చుల భారానికి తోడు దాని దుర్వినియోగానికి వ్య‌తిరేకంగా పోరాడాల్సిన ప‌రిస్ధితి త‌న‌ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయ‌ని బ్లాగ్‌లో బ్రూక్స్ రాసుకొచ్చారు. 30ల్లోనే త‌న‌కు గుండె పోటు రావాల‌ని తాను కోరుకోవ‌డం లేద‌ని అన్నారు. బ్రూక్స్ 18 ఏండ్ల వ‌య‌సులో 2009లో త‌న బెడ్రూమ్ నుంచే ఒమెగ‌ల్‌ను క్రియేట్ చేశారు. అప‌రిచితులు ఆన్‌లైన్ వేదిక‌గా క‌లుసుకుని, క‌నెక్ట్ అవుతూ స్నేహితులుగా మారాల‌నే ఉద్దేశంతో ఈ ప్లాట్‌ఫాంను డెవ‌ల‌ప్ చేశారు. త‌న కాలేజీ రోజుల్లో సామాజిక ఇంట‌రాక్ష‌న్ త‌న‌కు కొర‌వ‌డటంతో ఆయ‌న ఈ వెంచర్‌ను స్టార్ట్ చేశాడు. ఆపై ఒమెగ‌ల్‌కు మెరుగైన ఆద‌ర‌ణే ల‌భించినా ప్లాట్‌ఫాం దుర్వినియోగ‌మ‌వుతుంద‌నే ఆరోప‌ణ‌లు రావ‌డంతో వెబ్‌సైట్ ప్ర‌తిష్ట మ‌స‌క‌బారింది.

ప్రాణం తీసిన రోబో

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రోబో’లో ప్రొఫెసర్‌ బోరా తయారు చేసిన రోబో గన్ను తీయమంటే బన్ను తీసిన సన్నివేశం గుర్తుంది కదా! తాజాగా ఇలాంటి ఘటనే దక్షిణ కొరియా (South Korea)లో ఓ ఫ్యాక్టరీలో నిజంగా జరిగింది. అయితే, సినిమాలో ఆ సన్నివేశం నవ్వుపుట్టించినప్పటికీ.. నిజ జీవిత సంఘటన మాత్రం ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. టెక్నాలజీలో లోపాలుంటే అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. వివరాల్లోకి వెళితే..చాలా అరుదుగా జరిగే ఈ సంఘటన దక్షిణ కొరియాలోని ఓ వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత ఫ్యాక్టరీలో చోటుచేసుకుంది. రోబో (Industrial robot) అనుసంధానంతో పనిచేసే ఓ మెషీన్‌.. మనిషిని, కూరగాయలతో ప్యాక్‌ చేసిన పెట్టెతో పోల్చుకోవడంలో విఫలమైంది. ఇదే ప్రమాదానికి దారితీసిందని స్థానిక పోలీసులు తెలిపారు. కంపెనీ ప్యాకింగ్‌ విభాగంలో పారిశ్రామిక రోబో (Industrial robot)లను అమర్చారు. ఇవి కూరగాయలతో నింపిన పెట్టెలను తీసి కన్వేయర్‌ బెల్ట్‌పై వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓ రోబో.. దగ్గర్లో ఉన్న వ్యక్తిని పెట్టెలా భావించి అతణ్ని లాగి బెల్ట్‌పై బలంగా పడేసింది. అది తన మరచేతులతో మనిషిని గట్టిగా పట్టుకున్నప్పుడు అతడి ఛాతి, ముఖం ఛిద్రమయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయింది.రోబోలో లోపం వల్ల అది మనిషిని బాక్స్‌లా గుర్తించిందని కంపెనీ వివరణ ఇచ్చింది. రెండు రోజుల క్రితమే రోబో సెన్సర్‌లో లోపం ఉందని ఫ్యాక్టరీ సిబ్బంది గుర్తించినట్లు పేర్కొంది. దాన్ని బాగు చేయడానికి తయారీ కంపెనీకి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. దాన్ని బాగు చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని.. పైగా మరమ్మతు నిర్వహిస్తున్న వ్యక్తినే అది పొరబడిందని పేర్కొంది. దక్షిణ కొరియాలో ఇలాంటి ప్రమాదం జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. మార్చిలో ఓ వాహన తయారీ సంస్థలో ఓ కార్మికుడు రోబో చేతిలో చిక్కి తీవ్రంగా గాయపడ్డారు.

పీయుష్ గోయల్తో మస్క్ భేటీ

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్తో భేటీ కానున్నట్లు రాయిటర్స్ సంస్థ వెల్లడించింది. అమెరికాలో వచ్చేవారం వీరు సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపింది. భారత్లో టెస్లా కార్ల తయారీ అంశంపై వీరు చర్చించుకునే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తిగా విదేశాల్లోనే తయారైన EVల దిగుమతిపై ఉన్న సుంకాన్ని 100 నుంచి 15శాతానికి తగ్గించే పాలసీపై కూడా వీరు చర్చించవచ్చని తెలిపింది.

* భారీగా తగ్గిన బంగారం ధరలు

ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా చాలా మంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల వరుసగా పండుగలు ఉండటంతో బంగారం రేట్లు తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. తాజాగా, నేడు బంగారం ధరలు తగ్గాయి. చాలా రోజుల తర్వాత పసిడి ధరలు భారీగా తగ్గడంతో మహిళలు సంతోషిస్తున్నారు.హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:22 క్యారెట్ల బంగారం ధర- 55,700,24 క్యారెట్ల బంగారం ధర-60,760.విజయవాడలో నేటి బంగారం ధరలు:22 క్యారెట్ల బంగారం ధర- 55,700,24 క్యారెట్ల బంగారం ధర-60,760.

జియోఫోన్ ప్రైమా సేల్స్ షురూ

కై-ఓఎస్ ప్లాట్ఫామ్ ఆధారిత 4జీ స్మార్ట్ఫోన్ కీప్యాడ్ జియోఫోన్ ప్రైమా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. రిటైల్ స్టోర్స్తో పాటు రిలయన్స్ డిజిటల్ డాట్ ఇన్, జియోమార్ట్ ఎలక్ట్రానిక్స్, అమెజాన్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా విక్రయాలు ప్రారంభమైనట్లు సంస్థ తెలిపింది. దీని ధర రూ. 2,599 అంగుళాల డిస్ప్లే స్క్రీన్, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ, 23 భాషలను సపోర్ట్ చేయడం వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఫీచర్ ఫోన్ తరహాలోనే ఉన్నా వీడియో కాలింగ్, ఫొటోల కోసం డిజిటల్ కెమెరాలు, జియోటీవీ, జియోసినిమా వంటి ఎంటర్టైన్మెంట్ సర్వీసులు, జియోపే లాంటి యూపీఐ చెల్లింపుల విధానం మొదలైన ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి.

అమెజాన్ లో మళ్లీ జాబ్స్ కట్

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. అమెజాన్ మ్యూజిక్ లో పలువురు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. కస్టమర్ల ప్రాధాన్యతలు, వ్యాపార వృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు. కాగా, గతేడాది అమెజాన్ 27వేల మంది ఉద్యోగులను తొలగించింది.

* నేడు పెట్రోల్, డీజిల్ ధరలు

ప్రతి నెల 1 వ తేదీ వచ్చిందంటే చాలు సామాన్య ప్రజలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పుల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. నిత్యావసర వస్తువుల్లో ఒకటైన పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి నెల సవరిస్తుంటారు. అయితే గరిష్ట స్థాయిలో కొనసాగుతోన్న ప్యూయల్ ధరలు గత కొంత కాలం నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. కాగా.. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..హైదరాబాదు:లీటర్ పెట్రోల్ ధర: 109.66,లీటర్ డీజిల్ ధర: 98.విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర: 110.48,లీటర్ డీజిల్ ధర: 98. విజయవాడ: లీటర్ పెట్రోల్ ధర: 111.76,లీటర్ డీజిల్ ధర: 99.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z