NRI-NRT

కాలిఫోర్నియా తెలుగు అమ్మాయికి 21 లక్షల బహుమతి

కాలిఫోర్నియా తెలుగు అమ్మాయికి 21 లక్షల బహుమతి

అగ్ని ప్రమాదాలను ఎంత ముందుగా పసిగట్టగలిగితే నష్టాన్ని అంతగా తగ్గించవచ్చు. స్మోక్ డిటెక్టర్ల వంటి పరికరాలు ఇందుకే వాడుతుంటాం మనం. అయితే వీటితో కొన్ని చిక్కులున్నాయి. ప్రమాదాన్ని గుర్తించి స్పందించేందుకు కొంత సమయం పడుతుంది. ఈ సమస్యను కూడా అధిగమించేలా చాలా వేగంగా మంటలు, అగ్ని ప్రమాదాలను గుర్తించేందుకు ఓ అద్భుత పరికరాన్ని భారత సంతతి విద్యార్థి ఒకరు ఆవిష్కరించారు. ఆ వినూత్న ఆవిష్కరణకు గానూ రూ. 21 లక్షల ఫ్రైజ్ మనీని గెలుపొందింది.

వివరాల్లోకెళ్తే.. కాలిఫోర్నియాలో శాన్ జోస్కు చెందని 12 ఏళ్ల షాన్యా గిల్ ఆమె రూపొందించిన ఫైర్ డిటెక్టర్ డివైస్ ధర్మో ఫిషర్ సైంటిఫిక్ జూనియర్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ పోటీల్లో అత్యున్నత అవార్డు థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఆస్కెండ్ అవార్డును గెలుచుకుంది. తాను చూసిన ఆ ప్రమాదం షాన్యాను రూపొందించడానికి ప్రేరేపించింది. 2022 వేసవిలో తమ ఇంటి వెనుక ఉన్న రెస్టారెంట్ అగ్నిప్రమాదానికి గురైంది. దీంతో తన అమ్మ చాలా జాగ్రత్తగా ఉండేదని. ఇంటి నుంచి బయటకొస్తే చాలు వంటగదిలో స్టవ్ ఆఫ్ అదో లేదో అని ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం లేదా ఒక్కోసారి తననే చూడమని పదేపదే అడుగుతుండేదని చెబుతోంది షాన్యా.

దీంతో ఈ సమస్యను ఎలా నివారించాలని ఆలోచిస్తుండగా.. థర్మల్ కెమెరాలు శీతకాలంలో ఇళ్లలో వేడి లేకపోవడాన్ని గుర్తించగలవని కనుగొంది. ఈ కెమెరాలే ఇళ్లలోని మంటలను త్వరితగతిన గుర్తించగలవా? అని ఆశ్చర్యపోయింది. ఆ థర్మల్ కెమరానే కాంపాక్ట్ కంప్యూటర్కు కనెక్ట్ చేసే ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ను రూపొందించింది. ఆ తర్వాత వ్యక్తుల మధ్య తేడాను గుర్తించేలా ప్రోగ్రామింగ్ చేసింది. ఫలితంగా బర్న్ అయ్యే వస్తువులను ఐడెంటిఫై చేయడం మొదలు పెట్టింది షాన్యా రూపొందించిన డివైజ్ .

ఈ ముందస్తు హెచ్చరికతో ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలను రక్షించగలుగుతామని చెప్పుకొచ్చింది. ఈ డివైజ్ సుమారు పది నిమిషాలన పాటు మనుషులను గుర్తించడమే కాకుడుండా వేడకి కారణమయ్యే వాటిని గుర్తించి టెక్స్ట్ సందేశాన్ని ఇచ్చేలా ప్రోగ్రామ్ చేసింది. ఈ డివైజ్ నూటికి 97 శాతం మనుషులను, ఉష్ణానికి కారణమయ్యే కారకాలను విజయవంతంగా గుర్తిస్తోంది. ఈ ఫైర్ డిటెక్షన్ ఆవిష్కరణకు గానూ శాన్యా అత్యున్నత అవార్డు తోపాటు సుమారు రూ. 21 లక్షలు ఫ్రైజ్ మనీని గెలుచుకుని అందరిచేత శెభాష్ అని ప్రసంశలందుకుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z