చలికాలం వస్తూ వస్తూ చలిని తెచ్చినట్టే.. తినాల్సిన పుడ్ లిస్ట్ ను కూడా తెస్తుంది. వాటిల్లో బెల్లం కచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఏడాది పొడవునా బెల్లం మీద ఇష్టం లేకపోయినా.. చలికాలంలో మాత్రం తినాలనిపిస్తుంది. తినాలి కూడా. షుగర్తో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు అంటున్నారు. పైగా చలికాలంలో మరీ మంచిదట.
దీంట్లో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి పుష్కలం. వంద గ్రాముల బెల్లంలో ఈ ఖనిజాలు సుమారు 11 మిల్లీగ్రాములు ఉంటాయి. బెల్లం హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. రక్తహీనత లేకుండా చేస్తుంది. నీరసం, అలసట వంటి వాటిని దరిచేరనీయదు.
• బెల్లంలో యాంటీ అలర్జీ గుణాలు ఉంటాయి. దీంతో దగ్గు, జలుబు రాకుండా కాపాడుతుంది.
• బెల్లంలో మెగ్నీషియం ఎక్కువ ఉండడంతో తిన్నది త్వరగా జీర్ణం అవుతుంది.
• అందుకే చలికాలంలో రోజూవారీ ఫుడ్ లో బెల్లం ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.
• చాలామందికి కేవలం బెల్లం తినడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్లు బెల్లంతో పాటు ఇతర ఫుడ్ ను కలుపుకోవచ్చు.
బెల్లం- వేరుశనగలు..
పల్లి చిక్కీ, పల్లిపట్టి రూపంలో వేరుశనగతో బెల్లంను కలిపి తినొచ్చు. ఇది మహిళల్లో పీరియడ్స్ పెయిన్ తగ్గిస్తుంది.
బెల్లం- శనగలు..
బెల్లంను, శనగలను కలిపి తినొచ్చు. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. హిమోగ్లోబిన్ ను పెంచుతుంది.
పసుపుతో బెల్లం..
పసుపు, బెల్లం, నెయ్యి…శీతాకాలంలో మంచి కాంబినేషన్. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇది మంచి మిశ్రమం కూడా.
బెల్లం – నువ్వులు..
నువ్వులు, నెయ్యి, బెల్లం కలిపి తింటే చలికాలంలో ఇబ్బంది పెట్టే దగ్గు, జలుబును ఈజీగా ఎదుర్కోవచ్చు.
👉 – Please join our whatsapp channel here –