సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గురునానక్ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేత దేవినేని అవినాష్‌తో పాటు పెద్ద ఎత్తున కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులు పాల్గొన్నారు. ‘ఇండియన్-2’ సినిమా చిత్రీకరణ కోసం కమల్‌హాసన్ విజయవాడ వచ్చారు. దీనిలో భాగంగానే కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –