Politics

పెన్షన్ దారులకు శుభవార్త చెప్పిన కేసీఆర్

పెన్షన్ దారులకు శుభవార్త చెప్పిన కేసీఆర్

కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గంలోనే మా సొంత తల్లిగారి ఊరు అని చెప్పుకొచ్చాడు. కామారెడ్డికి తనకు చిన్నప్పటి నుంచే అనుబంధం ఉంది. నేను కామారెడ్డికి వస్తే చాలా వస్తాయి. కేసీఆర్ వెంట కామారెడ్డి, ఎల్లారెడ్డికి కాళేశ్వరం నీళ్లు వస్తాయి. బీడీ కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేస్తామి హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. కామారెడ్డి నియోజకవర్గంలో పల్లెలను అభివృద్ధి చేయాలని గంప గోవర్థన్ కోరడంతో తాను కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు.బీడీ కార్మికుల పెన్షన్ కూడా రూ.5వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇండియాలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా తెలంగాణ తప్ప ఎక్కడా పెన్షన్ ఇవ్వడం లేదు. కటాఫ్ డేట్ 2014 వరకు పెట్టడంతో కొత్త వారికి పెన్షన్ రావడం లేదని కొందరూ ఆందోళన చేస్తున్నారు. కొత్త బీడీ కార్మికులు లక్ష మంది ఉంటారు కావచ్చు. వారందరికీ బీడీ పెన్షన్ మంజూరు చేస్తాం. పెన్షన్ రూ.5వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z