Movies

మంగళవారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్

మంగళవారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్

‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది.

నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘మంగళవారం’ సినిమా విడుదల కానుంది. ఈ నెల 11న… శనివారం హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెషన్ సెంటర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆ ఫంక్షన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారు. అల్లు ఆర్మీ, అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది.

‘మంగళవారం’ ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. సినిమాలో మూడు పాటలను కూడా విడుదల చేశారు. వాటికి మంచి స్పందన లభిస్తోంది. ‘ఆర్ఎక్స్ 100’ తరహాలో మరోసారి డిఫరెంట్ కంటెంట్ అండ్ కమర్షియల్ బేస్డ్ సినిమాతో అజయ్ భూపతి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారనే నమ్మకం ప్రేక్షకులలో కలిగించింది. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z