తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆ రెండు రూట్ల మధ్యలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-రాక్సోల్ మధ్య ఈ ట్రైన్లు.. వయా నిజామాబాద్, నాందేడ్ స్టేషన్లు మీదుగా పరుగులు పెట్టనున్నాయి. దీపావళి, దంతేరాస్ పండుగులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో సికింద్రాబాద్-రాక్సోల్-సికింద్రాబాద్ మధ్య నాలుగు జనసాధారణ ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ జనసాధారణ్ ప్రత్యేక రైళ్లల్లో 22 అన్-రిజర్వ్‌డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 2400 మందికి సీటింగ్ సౌకర్యం ఉంటుంది. అలాగే జనసాధారణ్ ప్రత్యేక రైళ్లల్లో ఛార్జీలు తక్కువగా ఉంటాయి.
తక్కువ సమయంలో సంబంధిత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు ఈ జనసాధారణ్ రైళ్లు అనువైనవి. జనసాధారణ్ రైళ్లల్లో టికెట్ ఛార్జీలు.. ఎక్స్‌ప్రెస్ బస్సుల కంటే 50 శాతం తక్కువగా ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ స్టేషన్లలకు వెళ్లే ప్రయాణీకులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే ఈ రైళ్లు బోలారం, మేడ్చల్, అకానాపేట్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బాస్మత్, హింగోలి దక్కన్, వాషిం, అకోలా, ఖాండ్వా, ఇటార్సీ, పిపారియా, జబల్పూర్, కాట్ని, సత్నా, మాణీకపూర్, ప్రయాగ్రాజ్ ఛోకీ, పండిట్. డి. డి. ఉపాధ్యాయ, బౌక్సర్, అరా, పాటలిపుత్ర, హాజీపూర్, ముజఫర్పూర్, సీతామర్హి జంక్షన్ స్టేషన్‌లలో ఆగుతాయి.
07007 నెంబర్‌తో సికింద్రాబాద్ – రాక్సోల్ ట్రైన్.. సికింద్రాబాద్‌లో ఉదయం 10.30 గంటలకు బయల్దేరి.. రాక్సోల్‌కు మంగళవారం ఉదయం 6 గంటలకు చేరుతుంది. ఈ ట్రైన్ నవంబర్ 12, 19న నడుస్తుంది. ఇక 07008 నెంబర్‌తో రాక్సోల్ – సికింద్రాబాద్ మధ్య నడిచే ట్రైన్.. రాక్సోల్ నుంచి రాత్రి 7.15 గంటలకు బయల్దేరి.. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది నవంబర్14, 21న పరుగులు పెట్టనుంది. కాగా, ఈ సౌకర్యాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని.. ముందుగానే టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.
👉 – Please join our whatsapp channel here –