Fashion

బ్యూటీ పార్లర్ ఇంజెక్షన్లు మంచివేనా?

బ్యూటీ పార్లర్ ఇంజెక్షన్లు మంచివేనా?

చాలా మంది అందానికి ఇంటి చిట్కాలు పాటిస్తుంటారు. సహజంగా లభించే వాటితో బ్యూటీప్యాక్‌లు వేసుకుంటూ ఉంటారు. వాటి ద్వారా ఎంత సమయంలో ఎంత ప్రయోజనం ఉంటుందో కూడా చూడాలి. ఎందుకంటే, కొంతమందికి స్కార్స్, పింపుల్స్, యాక్నె, డల్‌ స్కిన్, కలర్‌ ఛేంజ్, చుండ్రు… ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాటికి చికిత్సనే సరైన మార్గం. ఆహారానికి సంబంధించినవి తప్పనిసరిగా పెళ్లికి రెండు నుంచి మూడు నెలల ముందు మార్పులు చేసుకోవాలి. సహజంగా చర్మంలో మార్పులు రావాలంటే పోషకాహారం మంచి ఎంపిక. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.

బ్యూటీ స్పాలో చికిత్స మంచిదేనా?
స్కిన్‌ టైటనింగ్, రింకిల్స్, స్కిన్‌ హైడ్రేషన్‌.. వంటి ట్రీట్‌మెంట్స్‌ బ్యూటీ స్పాలలో చేయించుకుంటారు. దీనికి కూడా ముందు సరైన కౌన్సెలింగ్‌ అవసరం. ఒక్కో వ్యక్తి చర్మ తత్త్వం ఒక్కో విధంగా ఉంటుంది. ఈ విధానంలో చర్మం రికవరీ అవడానికి కూడా సమయం పడుతుంది.

ఇంజక్షన్లు సరైనవేనా…
కృత్రిమంగా కొలాజన్, స్కిన్‌ బూస్టర్స్‌.. అని తీసుకుంటున్నారు. ఎవరో చెప్పారని కొంతమంది నర్సులను ఇంటికి పిలిపించుకొని ఇంజక్షన్లు చేయించుకుంటారు. మంచి లుక్‌ కోసం ట్రై చేయచ్చు. కానీ, వాటి డోసుల్లో తేడాలొస్తే మొత్తం తిరగబడుతుంది.

ఆన్‌లైన్‌లో చూసి …
సోషల్‌ మీడియా ప్రభావం వల్ల ఆన్‌లైన్‌లో బ్యూటీ ఉత్పత్తులు తెప్పించుకొని, అప్లై చేసుకోవడం చూస్తుంటాం. వాటి వల్ల ఇబ్బందుల పాలైన వారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే, అవి వారికి ఎంత వరకు నప్పుతాయో తెలియదు.

కెమికల్‌ పీలింగ్‌
కెమికల్‌ పీల్‌లో బయటి నుంచి చర్మంలోకి ఎలాంటి రసాయనాలు చొప్పించరు. మృతకణాలను తొలగిస్తారు, చర్మం పై పొర నుండి టానింగ్, పిగ్మెంటేషన్‌ తగ్గి కొత్త పొర కనిపిస్తుంది. అయితే, దీని ద్వారా చర్మంపై కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిపుణుల సలహా అవసరం. ఇంకొన్ని పీఆర్‌పీ చికిత్సలు చర్మ నిగారింపును తీసుకువస్తాయి. అయితే, వధువులు కాబోయే అమ్మాయిలు పెళ్లికి 3 నుండి 6 నెలల ముందు ఈ కాస్మెటిక్‌ విధానాలను ప్రారంభించాలి. ఎందుకంటే వారి సిట్టింగ్‌లలో కనీసం 3 వారాల గ్యాప్‌ ఉండాలి.

లైటర్‌ టోన్‌లకు డిమాండ్‌
పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు తమ ప్రీ–బ్రైడల్‌ విధానంలో రంగు ఫెయిర్‌గా మారడం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిజానికి, సూర్యకిరణాల నుండి మన చర్మాన్ని మనం రక్షించుకోనప్పుడు, చర్మంలో పాచెస్‌ ఏర్పడతాయి. కొన్నిసార్లు సూర్యకాంతి కుడి వైపున, మరి కొన్నిసార్లు ఎడమ వైపున ఎక్కువగా పడుతుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాలు చర్మ కణాలను దెబ్బతీస్తాయి. పిగ్మెంటేషన్‌ను ప్రేరేపిస్తాయి. దీంతో అంతటా ’చర్మపు రంగు’ ఒకే విధంగా ఉండదు. అంటే ముఖం మీద చాలా చోట్ల టాన్‌ ఉంటుంది. ఈవెన్‌ టో ని కలిగి ఉం