Politics

పండగ తరువాతే బీజేపీ మేనిఫెస్టో

పండగ తరువాతే బీజేపీ మేనిఫెస్టో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు భాజపాకు అవకాశం ఉందని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. దీపావళి పండగ తర్వాత పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు చెప్పారు. భాజపా అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు.

‘‘భాజపా, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నారు. ఎంఐఎం పార్టీతో భాజపా కలిసే అవకాశమే లేదు. కాంగ్రెస్‌, భారాస పార్టీలు భాజపాపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి. మజ్లిస్‌ పార్టీతో కలిసి లాభపడింది కాంగ్రెస్‌ పార్టీయే. భారాస పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. కేవలం ఐదు నెలల్లోనే కర్ణాటకను కాంగ్రెస్‌ భ్రష్టు పట్టించింది’’ అని కిషన్‌ రెడ్డి విమర్శించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z