టీవీ యాడ్స్ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల కోడ్ అతిక్రమించిందని బీఆర్ఎస్ లీగల్ టీమ్ సోమా భరత్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వకుండానే ఇచ్చినట్లు మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికల నుంచి ఆ వీడియోలను తెప్పించాం. కాంగ్రెస్ పార్టీ యాడ్స్‌పై ఈసీకి ఫిర్యాదు చేశాం. కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇక నుంచి ఇలాంటి పనులు అపుకోవాలని.. లేదంటే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. యాడ్స్‌పై సాయంత్రంలోపు ఈసీ ఆర్డర్స్ ఇస్తామని చెప్పింది. స్టార్ క్యాంపెయినర్స్ భాష పద్ధతిగా ఉండాలని ఈసీ సూచన చేసింది.’’ అని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –