DailyDose

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలపై ఉగ్రదాడికి కుట్ర- నేర వార్తలు

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలపై ఉగ్రదాడికి కుట్ర- నేర వార్తలు

క‌ల్తీ మ‌ద్యం తాగి 19 మంది మృతి

హ‌ర్యానా(Haryana)లో దారుణం జ‌రిగింది. క‌ల్తీ మ‌ద్యం తాగి 19 మంది మృతిచెందారు. య‌మునాన‌గ‌ర్‌, అంబాలా జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఈ మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. దీంతో స్థానిక గ్రామ‌స్థులు ఆందోళ‌న చేప‌ట్టారు. లిక్క‌ర్ డీల‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌తో లింకున్న ఏడు మందిని పోలీసులు అరెస్టు చేశారు. మందేబ‌రి, పంజెతో కా మ‌జ్రా, పూస్‌ఘ‌ర్‌, స‌ర‌న్ గ్రామాల్లో మ‌ర‌ణాలు సంభ‌వించాయి. మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వ వైఖ‌రిని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఖండించాయి. ప్ర‌స్తుతం పోలీసులు అనేక ప్రాంతాల్లో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. అంబాలా జిల్లాలో యూపీకి చెందిన ఇద్ద‌రు కార్మికులు గురువారం క‌ల్తీ మ‌ద్యం తాగి మ‌ర‌ణించారు. ఓ నిషేధిత ఫ్యాక్ట‌రీలో త‌యారు చేస్తున్న మ‌ద్యానికి చెందిన సుమారు 200 డ‌బ్బాల‌ను పోలీసులు సీజ్ చేశారు. లిక్క‌ర్ త‌యారీకి వాడిన వ‌స్తువుల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలపై ఉగ్రదాడికి కుట్ర

కేంద్ర దర్యాప్తు సంస్థ NIA కాసేపటి క్రితమే సంచలనమైన విషయాన్ని తెలియచేసింది. NIA తెలుపుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా మరియు కేరళ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. ఐసిస్ ఉగ్ర సంస్థ ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు పక్క సమాచారంతోనే NIA ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ ఏజెన్సీ మొత్తం 7 మందిని అరెస్ట్ చేసింది. వీరిని విచారించగా బయటపడిన వాస్తవం ప్రకారం వీరు కేవలం ముస్లిమేతరులు లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన పథకం రచించినట్లు చెప్పారు. ఉగ్రవాదులు వాట్సాప్ గ్రూప్ లలోనూ సమాచారాన్ని షేర్ చేసుకుంటూ ప్లాన్ లు చేస్తున్నారట. వీరు విదేశీయులతోనూ టచ్ లో ఉంటూ ఈ పథకాలకు ఉసిగొల్పుతున్నారని NIA తెలిపినది.కాగా వరల్డ్ కప్ జరుగుతుండడంతో ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే టెర్రర్ సృష్టిస్తామని ప్రకటించి అలజడి రేపాయి. కానీ ప్రశాంతంగా వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకుంది.

ఐదేళ్ల చిన్నారిపై కన్నేసిన మేనమామ

ఎన్నో చట్టాలు వస్తున్నప్పటికీ మహిళలపై జరిగే అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఆడది కనిపిస్తే చాలు వారి కామవాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కామాంధులు. బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలకు, చిన్నారులకు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. అయినవాళ్లే నమ్మించి మరి అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణ సంఘటనే బిహార్‌లో జరిగింది. వరసకు మేనమామ అయ్యే యువకుడు చాక్లెట్ కొనిస్తానని చెప్పి ఐదేళ్ల పాపని ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..సీతామర్షీ జిల్లా మేజర్‌గంజ్ బ్లాక్ ప్రాంతంలో ఓ ఐదేళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. దూరపు బంధువు, చిన్నారికి వరసకు మేనమామ అయ్యే యువకుడు ఇటీవల వాళ్ల ఇంటికి వచ్చాడు. ఆ యువకుడు చిన్నారిని మంచిగా ఆడిపించడం, కబుర్లు చెప్పడం లాంటివి చెయ్యడంతో అతడికి దగ్గరయ్యింది. ఇదంతా చూసిన తల్లిదండ్రులకు అతడిపై ఎలాంటి సందేహం కలగలేదు. దీంతో అంత అనుకూలంగా ఉందని భావించిన ఆ వ్యక్తి చిన్నారికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి బుధవారం ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. చాక్లెట్ కొనిచ్చిన అనంతరం పక్కనే ఉన్న చెరకు తోటలోకి తీసుకెళ్లాడు.చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక చనిపోవడంతో ఆ ప్రాంతంలోనే గొయ్యి తీసి అక్కడే పాతిపెట్టేసాడు. ఇక ఏమి తెలియనట్లుగా ఇంటికి తిరిగి వెళ్లాడు. అయితే.. చిన్నారి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు యువకుడిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపెట్టాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరుగా విలపించారు. గురువారం పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

*   కేర‌ళ‌లో రైతు ఆత్మ‌హ‌త్య‌

కేర‌ళ‌లో కేజీ ప్ర‌సాద్ అనే రైతు ఆత్మ‌హ‌త్య(Farmer Suicide) చేసుకున్నాడు. కుట్ట‌నాడ్ ప్రాంతంలోని అల‌ప్పుజాకు చెందిన అత‌ని వ‌య‌సు 55 ఏళ్లు. వ‌రి పంట సాగు కోసం నిధుల‌ను స‌మకూర్చుకోలేక అత‌ను బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు తెలిసింది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం అత‌ను విషం తాగి మ‌ర‌ణించాడు. తిరువ‌ల్ల‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో అత‌ను ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పుపడుతూ అత‌ను సూసైడ్ నోట్‌ రాశాడు. తాను ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్ల‌డానికి బ్యాంకులే కార‌ణ‌మ‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నాడు. బ్యాంకులు రుణం ఇవ్వ‌లేక‌పోవ‌డం వ‌ల్లే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోపించాడు.సూసైడ్ నోట్‌లో ప్రసాద్ ఇలా రాశాడు. 2011లో ఓ మేజ‌ర్ బ్యాంకు నుంచి వ్య‌వ‌సాయ రుణం తీసుకున్నాడు. అయితే పేమెంట్ చేయ‌లేక డిఫాల్ట్ అయ్యాడు. ఆర్థిక స్థితి స‌రిగా లేక ఆ బ్యాంకుకు 20 వేల చెల్లించాడు. ఆ త‌ర్వాత 2020 సంవ‌త్స‌రంలో ఆ లోన్ తీర్చేశాడు. వ‌న్ టైం పేమెంట్ స్కీమ్ కింద ఆ మొత్తాన్ని క‌ట్టేశాడు. ఇక ఆ త‌ర్వాత ఏ ఒక్క బ్యాంక్ కూడా త‌న‌కు రుణం ఇచ్చేందుకు ముందుకు రాలేద‌న్నాడు. సిబిల్ స్కోరు ప‌డిపోవ‌డం వ‌ల్ల రుణం సంపాదించ‌డం ఇబ్బంది అయిన‌ట్లు త‌న లేఖ‌లో తెలిపాడు.

భార్యను తాకట్టు పెట్టిన భర్త

సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ భర్త. భార్యభర్తల బంధాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించాడు. భార్యను జూదంలో పణంగా పెట్టి ఓడిపోయాడు. తన భార్యను ఏం తెలియని నగరంలో వదిలేసి వచ్చాడు. ఈ ఘటన యూపీలో అమ్రోహాలో జరిగింది. అయితే విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు ఆమెను రక్షించి ఇంటికి తీసుకొచ్చాడు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిదోలి కొత్వాలి ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన కుమార్తెను దేహాత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువకుడికి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే పెళ్లైనప్పటి నుంచి మహిళ అత్తామామలు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించేవారు. దీనికి తోడు బాధిత మహిళ భర్త జూదానికి అలవాటు పడి తరుచుగా డబ్బులు డిమాండ్ చేసే వాడు. జూదం కోసం రూ. 15 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒకసారి భర్తతో పాటు మహిళ ఢిల్లీకి వెళ్లింది. అక్కడ భార్యను పణంగా పెట్టి జూదం ఆడి ఓడిపోయాడు. ఇక చేసేదేం లేక ఆమెను అక్కడి వదిలేసి సొంతూరు చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె సోదరుడు ఢిల్లీలో రక్షించాడు. అయితే ఇలా ఇంటికి తీసుకువచ్చినా కూడా ఆరు నెలల క్రితం అత్తామామలు ఆమెను కొట్టి ఇంటి నుంచి గెంటేశారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం బాధిత మహిళ ఒంటరిగా ఉంటోంది. దీన్ని అవకాశంగా భావించిన మరిది ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో వేధింపులు భరించలేక మహిళ ఎస్పీ అనుపమ్ సింగ్ కు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భర్తతో పాటు 9 మందిపై వరకట్న వేధింపులు, దాడి ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

7లక్షల విలువైన చీరలు చోరీ

విజయవాడకు చెందిన ఓ లేడీ గ్యాంగ్ చెన్నైలో భారీ మొత్తంలో చీరలు కొట్టేసింది. గతనెల 28న ఓ స్టోర్ లో రూ.2లక్షలు విలువైన చీరలు చోరీ చేసింది. చెన్నై పోలీసుల రిక్వెస్ట్లో విజయవాడ పోలీసులు వీరి ఆచూకీ కనిపెట్టారు. చీరలు తిరిగిస్తే శిక్ష పడదనుకున్న ఈ ముఠా చెన్నై షాపుల్లో కాజేసిన రూ. 7 లక్షలు విలువైన చీరలను అక్కడి పోలీసులకు తిరిగిచ్చేసింది. కానీ వీరిని విడిచిపెట్టేది లేదంటున్నారు చెన్నై పోలీసులు.

శ్రీనగర్ దాల్ సరస్సులో అగ్ని ప్రమాదం

జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్రంలోని శ్రీన‌గ‌ర్‌లో ఉన్న దాల్ స‌ర‌స్సులో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆ స‌ర‌స్సులో ఉన్న బోట్ల‌కు ఇవాళ ఉద‌యం నిప్పు అంటుకుంది. దీంతో అక్క‌డ ఉన్న బోట్లు అన్నీ కాలీ బూడిద‌య్యాయి. భారీ స్థాయిలో మంట‌లు ఎగిసిప‌డుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాల్ స‌ర‌స్సులోని 9వ నెంబ‌ర్ ఘాట్ వ‌ద్ద ఉన్న హౌజ్‌బోట్‌లో మొద‌ట‌గా అగ్నిప్ర‌మాదం సంబవించింది. ఆ త‌ర్వాత క్ష‌ణాల్లోనే ఆ మంట‌లు వ్యాపించి.. స‌మీపంలో ఉన్న బోట్ల‌న్నీ ఆ మంట‌ల్లో కాలిపోయాయి. అయితే ఐదు హౌజ్‌బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, చాలా వ‌ర‌కు ఇత‌ర బోట్ల‌కు న‌ష్టం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ గాయలు కాలేదని అధికారులు వెల్లడించారు.

ముంబై వాసులకు బాంబే హైకోర్టు హెచ్చరిక

దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగానే ముంబైలో కూడా క్రమంగా వాయు కాలుష్యం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు ముంబై వాసులకు కీలక హెచ్చరిక చేసింది. దీపావళికి ఎడాపెడా పటాకులు కాల్చి నగర వాతావరణాన్ని ఢిల్లీలా మార్చవద్దని హెచ్చరించింది. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చే సమయ పరిమితిని కూడా కోర్టు మరింత కుదించింది.ముంబైలో ఎయిర్‌ పొల్యూషన్‌ పెరుగుతున్న నేపథ్యంలో.. దీపావళి సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మూడు గంటలు మాత్రమే పటాకులు కాల్చాలని ఈ నెల 6న బాంబే హైకోర్టు పరిమితులు విధించింది. అయితే కాలుష్య తీవ్రత ఎక్కువ అవుతుండటంతో కోర్టు ఆ కాల పరిమితిని మరింత కుదించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు రెండు గంటలు మాత్రమే పటాకులు కాల్చేందుకు అనుమతించింది.బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్‌ జీఎస్‌ కుల్కర్ణి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఈ సందర్భంగా ముంబై వాసులను ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఢిల్లీలా మారొద్దు. ముంబైకర్‌లుగానే ఉండండి’ అని వ్యాఖ్యానించింది. ముంబైలో వాయు నాణ్యత మరింత క్షీణిస్తున్నదని వ్యాఖ్యానించింది. ముంబై కూడా ఢిల్లీలా మారకుండా మరిన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z