Politics

కరెంటు కావాలా?కాంగ్రెస్‌ కావాలా?

కరెంటు కావాలా?కాంగ్రెస్‌ కావాలా?

కరెంటు కావాలా?కాంగ్రెస్‌ కావాలా? తెలంగాణ రైతులు ఆలోచన చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రైతులకు ఉచిత కరెంటు ఎందుకని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు. 70 లక్షల మంది రైతులు బిచ్చగాళ్లని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేతల తీరుతో రైతులు తిరిగి ఆగమవుతున్నారు.

కాంగ్రెస్‌ పాలనలో బావి వద్ద నిద్రపోయిన రోజులు రైతులు గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్‌ పాలనలో కోతలు లేని విద్యుత్‌ సరఫరా ఉండేదా? రైతులకు 3గంటల కరెంటు చాలని కాంగ్రెస్‌ చెబుతోంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు బాగుపడుతుంటే.. రైతులపై కాంగ్రెస్‌కు ఎందుకు ఇంత కక్ష. 24 గంటల కరెంటు వద్దన్న కాంగ్రెస్‌ను ఊరి పొలిమేరల దాకా తరిమికొట్టాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. 24 గంటల విద్యుత్‌పై కాంగ్రెస్‌ నాయకులను ప్రతి గ్రామంలో రైతులు నిలదీయాలి. మోటార్లకు మీటర్లు పెట్టమని మెడపై మోదీ కత్తి పెట్టారు. అయినా.. మోటార్లకు మీటర్లు పెట్టకుండా కేంద్రం నుంచి వచ్చే రూ.30వేల కోట్లు వదులుకున్నాం. పంజాబ్‌కు దీటుగా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్‌ 1 స్థానంలో ఉంది’’ అని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z