Business

నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

దీపావళి పండగ ముందు బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత 4-5 రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం (నవంబర్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,000 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 61,090లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 తగ్గింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,150లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,240గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,450లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,580గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,090గా కొనసాగుతోంది.

మరోవైపు వెండి ధర కూడా నేడు పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర శనివారం రూ. 74,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 800 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,000లు ఉండగా.. చెన్నైలో రూ. 77,000గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,750గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 77,000లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,000గా కొనసాగుతోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z