ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు గుండె శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గతవారం నుంచి బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ సామాజిక సాధికర బస్సుయాత్రలో పాలుపంచుకున్న బొత్స.. శృంగవరపుకోటలో అస్వస్థతకు గురయ్యారు.
గతవారం రోజులుగా మంత్రి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. విశాఖపట్నంలో వైద్య పరీక్షల అనంతరం మంత్రి బొత్స కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆయన కు ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో శనివాంర ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మంత్రి నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్య బృందం సూచించింది. బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. జ్వరంతో బాధపడుతూనే ఈ నెల 4న ఎస్.కోటలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్నారు. 5వ తేదీన శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లారు.
👉 – Please join our whatsapp channel here –