అధిక మాంసకృత్తులు, తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్న కడక్‌నాథ్ కోళ్లకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో డిమాండు పెరిగింది. మేలుజాతి కడక్‌నాథ్ కోళ్లకు ప్రసిద్ధమైన ఝాబువా పౌల్ట్రీ రైతుల ఆదాయం ఒక్కసారిగా ఊపందుకొంది. చలికాలం మొదలుకావడంతోపాటు ఎన్నికల సందడి బాగా ఉండటంతో ఈ కోళ్ల గిరాకీ 30 నుంచి 40 శాతం పెరిగినట్లు ఝాబువా కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ చందన్‌కుమార్ తెలిపారు. ఎన్నికలకు ముందు రూ.800 నుంచి రూ.1,200 వరకు ఉన్న కడక్‌నాథ్ పెద్ద కోడి ధర ఇపుడు రూ.1,500 వరకు పలుకుతోంది. భీల్ తెగకు చెందిన గిరిజనులు ఎక్కువగా నివసించే ఝాబువా ప్రాంతంలో స్థానికులకు ఈ కోళ్లు ఆహారంతోపాటు ఆర్థికవ్యవస్థలో అంతర్భాగం. నల్లగా ఉండే కడక్‌నాథ్ కోళ్లను స్థానిక భాషలో ‘కాలామాసి’ అంటారు.
👉 – Please join our whatsapp channel here –