Politics

తెలంగాణలో మోదీ వరుసగా మూడ్రోజులు ఎన్నికల ప్రచారం

తెలంగాణలో మోదీ వరుసగా మూడ్రోజులు ఎన్నికల ప్రచారం

నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత ప్రచారాన్ని హోరెత్తిస్తామని రాష్ట్ర బీజేపీ తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రచారంలో జోరు సాగిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే ప్రధాని మోదీ రాష్ట్రానికి ఓసారి వచ్చి బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు. వారం తిరక్కముందే ఇవాళ మరోసారి రాష్ట్రానికి మరోసారి వస్తున్నారు. ఈరోజు సికింద్రాబాద్​లో జరగనున్న మాదిగల విశ్వరూప మహాసభలో పాల్గొననున్నారు. ఈ సభలో మోదీ ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేస్తారని అంతా భావిస్తున్నారు.అయితే మోదీ తర్వాత రాష్ట్రంలో బీజేపీ జాతీయ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా.. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు మోదీ కూడా మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మూడ్రోజులు రాష్ట్రంలో పర్యటించనున్న మోదీ వరుసగా మూడ్రోజులు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 25, 26, 27వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర నేతలు తెలిపారు. 25వ తేదీన కరీంనగర్​లో.. 26వ తేదీన నిర్మల్​లో నిర్వహించనున్న సభల్లో పాల్గొననున్నారు. 27వ తేదీన హైదరాబాద్‌లో రోడ్ షోలో పాల్గొంటారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z