బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కండల వీరుడు సరసన కత్రినా కైఫ్ నటించారు. సల్మాన్, కత్రినాల కాంబోలో ఒకప్పుడు వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా నేడు (నవంబర్ 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే పలు చోట్ల టైగర్ 3 ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. టైగర్ 3 సినిమాకి ఎక్స్‌లో మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది సినిమా బాగుందని ట్వీట్స్ చేస్తుంటే.. మరికొంతమంది బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు. టైగర్ 3ని పఠాన్, జవాన్ చిత్రాలతో పోలుస్తూ.. ఆ స్థాయిలో లేదని అంటున్నారు.
‘టైగర్ 3 రోరింగ్ బ్లాక్ బస్టర్. జేమ్స్ బాండ్, బౌర్న్ చిత్రాల తరహాలో ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ ప్యాక్ట్ మూవీగా మనీష్ శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. స్పై థ్రిల్లర్ చిత్రాలకు బాస్‌గా ఉంది. సల్మాన్‌కు మంచి కమ్ బ్యాక్ మూవీ. ఇమ్రాన్ హష్మీ విలనిజం, కత్రినా కైఫ్ యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టారు. స్పై యూనివర్స్‌లో బెస్ట్ సినిమా’ అని నెటిజన్ కామెంట్ చేశాడు. ‘టైగర్ 3 డిస్పపాయింట్ చేసింది. సల్మాన్ ఖాన్ నీరసంగా కనిపించాడు. షారుక్ సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాడు. కానీ ఈ సినిమా సాగదీసినట్టుగా ఉంది. కత్రినా చక్కగా నటించింది అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
👉 – Please join our whatsapp channel here –