రాశిఫలాలు ( 12.11.2023 నుంచి 18.11.2023 వరకు )
మేషం
ఉత్సాహంగా కొత్త పనులు ప్రారంభిస్తారు. పిల్లల చదువులు ముందుకెళ్తాయి. కళారంగంలో ఉన్నవారికి అనుకూల సమయం. అనవసర ప్రయాణాల వల్ల వృథా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు. బంధువులతో మనస్పర్ధలు రావచ్చు. వాహన చోదన విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ, రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులను పట్టుదలతో అధిగమిస్తారు. వ్యాపార క్రయవిక్రయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యవసాయదారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.
వృషభం
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. భార్యా పిల్లలతో సత్సంబంధాలు ఉంటాయి. సాహిత్య గోష్టిలో పాల్గొంటారు. విందు, వినోదాలు ఉల్లాసాన్ని ఇస్తాయి. రాజకీయ, కోర్టు, ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత ఉంది. విజయాలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు చేకూరే అవకాశం. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. అన్నదమ్ములతో మనస్పర్ధలు రావచ్చు. పిల్లల చదువుల విషయంలో ఆటంకాలు ఉంటాయి.
మిథునం
ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే సత్ఫలితాలు ఉంటాయి. పిల్లల చదువు విషయంలో కలిసొస్తుంది. ఆఫీసు వ్యవహారాల్లో మీదే పైచేయి. వ్యాపారులకు క్రయ విక్రయాల్లో సత్ఫలితాలు ఉన్నా.. గ్రహాల ప్రభావంతో కొంత జాగ్రత్త అవసరం. అనవసర ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్యాలు, ఆందోళనలు ఇబ్బంది పెడతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. తలపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. భూ లావాదేవీల విషయంలో జాగ్రత్త. భార్యాపిల్లలతో చిన్నపాటి గొడవలు ఉంటాయి.
కర్కాటకం
ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. ఆత్మీయుల వల్ల కొన్ని పనులలో సత్ఫలితాలు ఉంటాయి. భూ, వాహన, యంత్రాల వల్ల ఆదాయం పెరుగుతుంది. మనోవేదన కారణంగా మనసు స్థిమితంగా ఉండదు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. పిల్లల చదువులు, వివాహాది శుభకార్యాల విషయంలో చిన్నపాటి అవరోధాలు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి.
సింహం
అని విషయాల్లో జాగ్రత్త అవసరం. అనుభవజ్ఞుల సహాయ సహకారాలు అందుతాయి. దైవభక్తి, గురుభక్తి పెంపొందుతాయి. వ్యాపార వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వినోద పర్యటనలు చేస్తారు. కొన్ని ఎదురుదెబ్బల వల్ల తాత్కాలికంగా ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఖర్చులు పెరుగుతాయి. భూములు, వాహనాల వల్ల తగాదాలు. బంధువులతో విభేదాలు. ప్రయాణాలు కలిసివస్తాయి. ధార్మిక చింతనతో మనోవేదనను అధిగమిస్తారు.
కన్య
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. పిల్లల చదువులు, శుభకార్యాల విషయంలో దైవశక్తితో అవరోధాలను అధిగమిస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. స్టాక్ మార్కెట్ వ్యాపారంలో ఉన్నవారు విజ్ఞతతో వ్యవహరించాలి. కుటుంబంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సత్ప్రవర్తన కారణంగా పనులు నెరవేరుతాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. ఖర్చులు పెరగడంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మీయులతో సత్సంబంధాలు లోపిస్తాయి. ఆస్తుల విషయంలో తగాదాలు ఎదురవుతాయి.
తుల
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. స్థిరాస్తి తగాదాలు కొంతమేర సమసిపోతాయి. అన్నదమ్ములతో సత్సంబంధాలు నెలకొంటాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలు కలిసివస్తాయి. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. క్రయ విక్రయాలలో లాభాలు ఉంటాయి. సమయానికి డబ్బు అందుతుంది. శుభ కార్యాల విషయంలో ఆటంకాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో వాగ్వాదాలు తప్పకపోవచ్చు. సంగీత, సాహిత్య రంగాలలోని వారికి సహ-కళాకారులతో మనస్ఫర్ధలు.
వృశ్చికం
ప్రతి నిర్ణయంలోనూ ఆలోచనతో ముందుకు వెళ్లడం ఉత్తమం. భక్తి పెరుగుతుంది. అనుభవజ్ఞుల సలహా మంచి చేస్తుంది. వృథా ఖర్చుల వల్ల ఆర్థిక పరిస్థితిలో కొద్దిపాటి మార్పు ఉంటుంది. అన్నదమ్ముల వల్ల అభిప్రాయ భేదాలు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో వాయిదాలు ఉంటాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అనాలోచిత పెట్టుబడుల కారణంగా చేదు అనుభవాలు. ఇంట్లో సుహృద్భావ వాతావరణం లేకపోవడం వల్ల తాత్కాలిక నిర్లిప్తత. కొంతమేర నిరాసక్తత చోటు చేసుకొంటుంది.
ధనుస్సు
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తి అవుతాయి. దీనివల్ల మానసికంగా ధైర్యం వస్తుంది. పిల్లల చదువులు దారికొస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. శుభకార్యాలకు పూనుకుంటారు. వాణిజ్య పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆలోచించి పెట్టుబడులు పెడితే లాభాలు వచ్చే అవకాశం ఉంది. సంగీత, సాహిత్య, కళా రంగాలలో అనుకూల వాతావరణం. సకాలంలో డబ్బు అందకపోవడంతో పనులలో ఆలస్యం ఉంటుంది.
మకరం
జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ, రాజకీయ వ్యవహారాల్లో సంతృప్తికర వాతావరణం ఉంది. భార్యాపిల్లలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయం అంతంత మాత్రమే. ఖర్చులు మాత్రం పెరుగుతాయి. బంధువులతో మనస్పర్ధలు రావచ్చు. పనులలో ఆటంకాలు తప్పవు. క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్త. అనవసర భయాలు వెంటాడతాయి. ప్రారంభించిన పనులలో చిన్నాపెద్దా విఘ్నాలు ఎదురవుతాయి.
కుంభం
సత్ఫలితాలు ఉంటాయి. సాహసోపేత నిర్ణయాలతో రెట్టింపు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో సానుకూలమైన మార్పు ఉంది. నలుగురితో సత్సంబంధాలు నెలకొంటాయి. సోదరులు, బంధువుల వల్ల చాలా పనులు సునాయాసంగా నెరవేరుతాయి. వాహన వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. నిర్మాణ రంగంలో ఉన్నవారికి అనుకూల వాతావరణం. సాహిత్య, కళా రంగాల వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. రాజకీయ నాయకులు సవాళ్లను అధిగమిస్తారు.
మీనం
జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించే మనోధైర్యాన్ని పొందగలరు. అనుభవజ్ఞుల సహాయసహకారాలు లభిస్తాయి. ఉద్యోగ, రాజకీయ వ్యవహారాల్లో అననుకూలత ఉంది. అనాలోచిత పెట్టుబడుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర ప్రయాణాలు వద్దు. కొత్త ప్రాజెక్టులను వాయిదా వేసుకోవడం మంచిది. పిల్లల చదువులు, శుభకార్యాల విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.