‘జైలర్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth). ఈ జోష్‌లో ఆయన వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. వీటిలో ఒకటి కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘లాల్‌సలామ్’ (Lal Salaam). విష్ణువిశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన లాల్ సలామ్ టైటిల్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని టీవిలో చూసి ఉంటారు. రేడియోలో విని ఉంటారు. కానీ డైరెక్ట్ గా చూశారా.. అంటూ క్రికెట్ మ్యాచ్‌తో ఈ టీజర్ ప్రారంభకాగా, ఇది స్పోర్ట్స్ డ్రామాలా కనిపిస్తుంది, అయితే ఈ మ్యాచ్ వలన హిందూ ముస్లింల మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో రజనీకాంత్ మొయిదీన్ భాయ్ అనే స్పెషల్ రోల్‌తో అలరించనున్నాడు. రజనీకాంత్ తన సిగ్నేచర్ స్లో మోషన్ స్టైల్‌లో విలన్‌లను కొట్టడం టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. మరోవైపు ఈ మూవీ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘కై పొ చే’ (Kai Po Che) సినిమాకు రీమేక్‌గా ఈ రూపొందుతున్నట్లు తెలుస్తుంది.
👉 – Please join our whatsapp channel here –