DailyDose

కడపలో గ్రామ వాలంటీర్‌ దారుణ హత్య-నేర వార్తలు

కడపలో గ్రామ వాలంటీర్‌ దారుణ హత్య-నేర వార్తలు

కర్ణాటకలో దారుణం

మహిళ, ఆమె ముగ్గురు పిల్లలను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. ఆగంతకుడి కత్తి దాడిలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కెమ్మన్ను ప్రాంతంలోని ఒక ఇంట్లోకి మాస్క్‌ ధరించిన వ్యక్తి చొరబడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేశాడు. కత్తి పోటు వల్ల 46 ఏళ్ల హసీనా, 23, 21, 12 ఏళ్ల వయసున్న ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఉడిపి జిల్లా ఎస్పీ అరుణ్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతురాలి భర్త గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. మహిళ, ఆమె ముగ్గురు పిల్లల హత్యకు కారణం ఏమిటన్నదని తెలియదని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

*  కడపలో గ్రామ వాలంటీర్‌ దారుణ హత్య

కడపలోని ఎల్ఐసీ ప్రధాన కార్యాలయంలో హత్య జరిగింది. భవానీశంకర్‌ (37) అనే వ్యక్తిని తోటి స్నేహితుడే హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. కడప ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 14వ డివిజన్‌ వాలంటీర్‌గా భవానీశంకర్‌ పనిచేస్తున్నాడు. దీంతో పాటు కడపలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో డిజిటలైజేషన్‌ విభాగంలోనూ విధులు నిర్వర్తిస్తున్నాడు. భవానీ శంకర్‌కు అక్కడే పనిచేస్తున్న మల్లికార్జున్‌ మంచి స్నేహితుడు. ఇటీవల వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరికీ గొడవలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకు భవానీ శంకర్‌కు మల్లికార్జున్‌ ఫోన్‌ చేసి ఎల్‌ఐసీ కార్యాలయానికి రమ్మని పిలిచాడు. అక్కడికి భవానీ శంకర్‌ చేరుకోగానే.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో మెడపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ షరీఫ్‌ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లిక్కర్ పార్టీలో దొరికిన బిగ్ బాస్ ఫేమ్ హిమజ 

ఇబ్రహీం పట్నం సమీపంలోని జేబీ వెంచర్ ఓవిల్లలో హై ప్రొఫైల్ లిక్కర్ పార్టీలు జరిగాయి. లిక్కర్ పార్టీలో పలువురు సినీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ముఖ్యంగా లిక్కర్ పార్టీ నిర్వహించిన హిమాజ పై కేసు నమోదు చేశారు ఇబ్రహీం పట్నం పోలీసులు.ఎన్నికల కోడ్ ఉల్లంఘన లో బాగంగా ఎక్సైజ్ చట్టం,ipc కింద కేసు నమోదు చేశారు పోలీసులు.ఈ పార్టీ లో సినీ నటలు ఉన్నట్టు సమాచారం..ఇబ్రహీంపట్నం jb వెంచర్స్ lo sot మహేశ్వరం పోలీసుల దాడులు నిర్వహించారు. లిక్కర్ పార్టీ జరుగుతున్నట్లు పక్క సమాచారం తో దాడి చేశారు మహేశ్వరం sot పోలీసులు. అర్ద రాత్రి ఒంటి గంటకు సమాచారం రావటం తో పోలీసుల రంగ ప్రవేశం చేశారు. బిగ్ బోస్ ఫేమ్ హిమజ ఇంట్లో మందు పార్టీ నిర్వహించారు. ఈ మందు పార్టీ లో పెద్ద ఎత్తున యువతీ యువకులు పాల్గొన్నారు. దాదాపు 15 లీటర్ల మద్యం, సౌండ్ సిస్టం సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ నిబంధలను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

పండుగపూట విషాదం

దీపావళి పండుగ పూట విషాదం నెలకొంది. కాజీపేట దర్గా లోని బంధం చెరువులో దూకి తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. దర్గా కాజీపేటకు చెందిన కన్నెబోయిన రేణుక, ఆమె కుమార్తె నవ్య దగ్గరలో గల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వృద్ధురాలైన అత్త విషయం తెలియగానే గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీపావళి పర్వదినం రోజున జరిగిన ఈ సంఘటనతో దర్గా కాజీపేటలో విషాదం నెలకొంది. ఏసీపీ డేవిడ్ రాజు, కాజీపేట ఇన్స్పెక్టర్ రాజు సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.

పండగ పూట ఘోర రోడ్డు ప్రమాదం

పండగ పూట రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఘటన ఆదివారం మెదక్ పట్టణం కోలి గడ్డ వద్ద జరిగింది. స్కూటీ, టిప్పర్ ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు పిల్లలు తలలపై నుంచి వాహనం చక్రాలు వెళ్లడంతో నుజ్జు నుజ్జుయినా ఘటన మెదక్ పట్టణం కోలి గడ్డ వద్ద జరిగింది. టెక్మాల్ మండలం తంప్లుర్‌కు చెందిన హోమ్ గార్డ్ శ్రీనివాస్ గతంలో మెదక్ డీఎస్పీ వద్ద పని చేసే వాడు.. అతను గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.. అయన భార్యా అన్నపూర్ణ సర్వ శిక్ష అభియాన్‌లో పని చేస్తూ మెదక్‌లోనే ఉంటుంది. తన 14 ఏళ్ల లోపు ప్రణయ్, ప్రణీత్‌కు ఇద్దరు కుమారులతో కలిసి ఆదివారం స్కూటీ పై మార్కెట్ వైపు నుంచి వస్తుందనగా వెనక నుంచి వచ్చిన టిప్పర్ ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. స్కూటీ పై వెనక కూర్చున్న ఇద్దరు కుమారులు రోడ్డుపై పడడంతో వారి తలల పై టైర్ వెళ్ళింది.దీంతో ఇద్దరు పిల్లలతో తలలు నుజ్జు నుజ్జు కావడం ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. స్కూటీ నడిపిన మహిళా రోడ్డు పక్కన పడిపోవడంతో ప్రాణాలతో బయట పడింది. కానీ కళ్ల ముందే ఇద్దరు కుమారులు కంటి ముందే మాంసపు ముద్దలుగా పడి ఉన్నా మృత దేహాలను చూసి ఆ తల్లి బోరున విలపించింది. ఇద్దరు పిల్లల మృతి చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు.. ఇటీవలే మనోహర బాద్ వద్ద జరిగిన ప్రమాదంలో తల్లి ఇద్దరు పిల్లలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన మరువక ముందే మరో ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందడం జిల్లాలో విషాదాన్ని నింపింది. ఈ ఇద్దరు మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

*  ఎమర్జెన్సీ బ్రేకులతో రైలు నిలిపివేత

వేగంగా వెళ్తున్న రైలును ఎమర్జెన్సీ బ్రేకులతో నిలిపివేశారు. అయితే ఆకస్మిక కుదుపుల వల్ల (Sudden Jolt of Train) ఇద్దరు రైలు ప్రయాణికులు మరణించారు. జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒడిశాలోని పూరీ నుంచి ఢిల్లీ వెళ్తున్న పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌ శనివారం మధ్యాహ్నం చాలా వేగంతో ప్రయాణించింది. అయితే గోమోహ్, కోడెర్మా రైల్వే స్టేషన్‌ల మధ్య పర్సాబాద్ సమీపంలో ఓవర్‌హెడ్‌ విద్యుత్ లైన్‌ వైరు తెగిపోవడాన్ని లోకో పైలట్లు గమనించారు. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దీంతో భారీ కుదుపులతో రైలు ఆగింది. ఈ నేపథ్యంలో ఆ రైలు ప్రయాణికుల్లో ఇద్దరు చనిపోయారు.కాగా, ధన్‌బాద్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కామర్స్ మేనేజర్ అమరేష్ కుమార్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆ సమయంలో రైలు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని తెలిపారు. ఈ సంఘటన వల్ల ఆగిపోయిన పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌ను డీజిల్‌ ఇంజిన్‌ సహాయంతో గోమోహ్ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నాలుగు గంటల తర్వాత ఎలక్ట్రిక్‌ ఇంజిన్ సహాయంతో ఆ రైలు అక్కడి నుంచి కదిలినట్లు వెల్లడించారు.

కదులుతున్న రైళ్లలోనే మహిళపై అత్యాచారం

రాజస్థాన్ లోని చురు నగరంలోని కొత్వాలి ప్రాంతంలో హృదయ విదారకమైన అత్యాచార ఘటన వెలుగు చూసింది. కదులుతున్న రైలులో 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం మహిళా పోలీస్ స్టేషన్‌లో ప్రధాన నిందితుడు సహా ఐదుగురిపై కేసు నమోదైంది. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే వారి జాడ మాత్రం ఇంకా దొరకలేదని సమాచారం. నిందితుడు తనను బందీగా పెట్టుకున్నాడని కూడా బాధితురాలు ఆరోపించింది. మహిళా పోలీస్‌ స్టేషన్‌ పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం, 28 ఏళ్ల వివాహిత తనకు 2014 సంవత్సరంలో జుంజును జిల్లాలోని ఒక గ్రామంలో వివాహం జరిగిందని నివేదించింది. వివాహం తర్వాత, ఆమె చురులోని కొత్వాలి ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తుంది. ఇతని ఇంటికి సమీపంలోనే జ్యువెలరీ షోరూం ఉంది. అందులో నరేంద్ర అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. తనతో మొబైల్‌లో మాట్లాడాలని నరేంద్ర తరచూ ఒత్తిడి చేసేవాడని ఆరోపించింది.చురు నుంచి ఢిల్లీ వెళ్లే రైలులో ఆమెను కూర్చోబెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 3న స్వగ్రామానికి వెళ్తుండగా నరేంద్ర ఆమెకు ఫోన్ చేసి తన సోదరుడు నరేంద్ర వద్ద బంధీగా ఉన్నాడని చెప్పాడు. నగలు తీసుకుని ఇంటి నుంచి బయటకు రాకపోతే తన తమ్ముడిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పింది.. నగలతో బయటకు వెళ్లగానే నరేంద్ర ఆమెను కత్తితో బెదిరించి బైక్‌పై కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ్నుంచి చూరు రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తనను రైలులో ఢిల్లీకి తరలించాడు. రైలు చురు నుండి బయలుదేరిన వెంటనే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పింది. ఆమె టాయిలెట్‌కు తీసుకెళ్లిన నరేంద్ర కదులుతున్న రైలులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆ తర్వాత నిందితులు ఆమెను బెదిరించి అజ్మీర్, జైపూర్‌లకు కూడా తీసుకెళ్లారు. అక్కడ కూడా హోటల్‌లో ఆమెపై అత్యాచారం చేశాడు. నిందితులు ఆమెను పగటిపూట హోటల్ గదిలో బంధించి రాత్రి వేళల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు తనను బెదిరించి పత్రాలపై సంతకాలు కూడా చేయించుకున్నారని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయంలో మరో ముగ్గురు నిందితులు కూడా తనకు సహకరించారని బాధితురాలు ఆరోపించింది.

ఇంట్లోకి చొరబడిన చిరుత

తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూరు అటవీ ప్రాంతంలో చిరుత దాడిలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో విధుల్లో ఉన్న జర్నలిస్ట్‌ ఒకరు ఉన్నారు. ఆహారం కోసం అడవి నుంచి బయటకు వచ్చిన చిరుత కూనూరు సమీపంలోని గ్రామంలో ఓ వీధి కుక్కను వెంబడిస్తూ ఓ ఇంట్లోకి ప్రవేశించింది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.వెంటనే అక్కడి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు. చిరుత చొరబడిన ఇంట్లో ఓ వ్యక్తి ఉండటంతో అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన ఆరుగురిపై చిరుత దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన వీరిలో విధుల్లో ఉన్న ఓ జర్నలిస్ట్‌ కూడా ఉన్నారు. వీరందరినీ కూనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరుత ఇంకా ఇంట్లోనే ఉందని, దాన్ని బంధించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z