Politics

రేవంత్ పై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

రేవంత్ పై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

కార్యకర్తలను రెచ్చగొడుతూ దుర్భాషలాడుతున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి భారాస ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా రేవంత్‌పై నిషేధం విధించాలని కోరింది. ఈ మేరకు సీఈవో వికాస్‌రాజ్‌ను భారాస ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందజేశారు. రేవంత్ పదేపదే కార్యకర్తలను రెచ్చగొడుతూ దాడులను ప్రోత్సహిస్తున్నారని భారాస లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ ఆరోపించారు.మెదక్‌ ఎంపీ, దుబ్బాక భారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడిని కనీసం ఖండించకుండా కామెడీ చేస్తున్నారన్నారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని భరత్ కోరారు. రేవంత్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలని ఈసీని కోరినట్లు చెప్పారు. నిషేధించిన ప్రకటనను బ్యాన్డ్‌ అని పెట్టి మరీ కాంగ్రెస్‌ నేతలు ప్రసారం చేస్తున్నారని సోమా భరత్ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z