ఈ నెల 11న సీనియర్ నటుడు చంద్రమోహన్ 80 ఏళ్ల వయసులో మృతి చెందారు. కాగా ఆయన మృతదేహాన్ని అభిమానులు సందర్శనార్థం రెండు రోజులు ఆయన నివాసంలో ఉంచిన కుటుంబ సభ్యులు .. ఈ రోజు హైదరాబాద్ లోని పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. నటుడు చంద్ర మోహన్ సోదరుడు దుర్గాప్రసాద్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జరిగాయి. కాగా చంద్రమోహన్ తన జీవితంలో మొత్తం 932 చిత్రాల్లో నటించారు. కాగా చంద్రమోహన్ మృతితో తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరం నటులు మొత్తం చనిపోయారు. కాగా గతంలో కృష్ణ గారి మృతికి హాజరైన సందర్భంగా చంద్రమోహన్ మా తరం హీరోల్లో తానొక్కడినే మిగిలి ఉన్నానని బాధతో చెప్పుకొచ్చాడు.
👉 – Please join our whatsapp channel here –