Devotional

ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి

ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి

మేషం

రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయత్నం తల పెట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఆశిం చిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. అధికార బాధ్య తలు నిర్వహించడం జరగుతుంది. వ్యాపారాన్ని విస్తరించాలనే అభిప్రాయానికి వస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.

వృషభం

ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడం జరుగుతుంది. ఆదాయానికి, ఆనందానికి లోటు ఉండదు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ప్రధానమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. కుటుంబ సమస్యల్ని సమయ స్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పరవాలేదు.

మిథునం

ఎంత సానుకూలంగా వ్యవహరిస్తే అంత మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధ్యమవుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతిభా పాటవాలకు వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. రాదనుకుని వదిలే సుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి.

కర్కాటకం

ఆశించిన శుభవార్తలు వింటారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆదాయం పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, సకాలంలో వాటిని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకుం టారు. సతీమణి ఉద్యోగంలో పురోగతి చెందుతారు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

సింహం

రోజంతా ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యవహరించడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆశించిన ప్రతిఫలం ఉన్న ప్పటికీ, వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు సాధారణంగా సాగి పోతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఒత్తిడికి గురి చేస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరు స్నేహితుల వల్ల కొద్దిగా ఆర్థికంగా నష్టపో తారు.

కన్య

ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగు తుంది. అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరు స్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామికి అదృష్టం పడుతుంది.

తుల

తలపెట్టిన పనులు, వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. మనసులోని కోరికలు సాకారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారాలను పంచుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహా రాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఇతరుల వ్యవహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

వృశ్చికం

ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు మీరు ఆశించిన విధంగా అనుకూలంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, ఒత్తిడి తగ్గుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

ధనుస్సు

సర్వత్రా మీ మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది. కీలక వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. బంధువుల ద్వారా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ కృషికి, మీ ప్రతిభకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు నిల కడగా ముందుకు సాగుతాయి. సతీమణికి ఉద్యోగంలో మంచి అదృష్టం పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం

సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉన్నం దువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. పట్టుదలగా ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు. దైవ కార్యాల్లో పాల్గొం టారు.

కుంభం

ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి తప్పకపోవచ్చు. మిమ్మల్ని స్వలాభానికి ఉపయోగించుకునే వారు ఎక్కువగా ఉంటారు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయపరంగా, ఉద్యోగపరంగా ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. ఉద్యో గంలో అధికారులకు, సహోద్యోగులకు బాగా అండగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో బిజీ అయిపో తారు. కుటుంబ వ్యవహారాలను ఓర్పుగా పరిష్కరించుకోవడం మంచిది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మీనం

పని భారం, బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఆదాయం, ఆరోగ్యం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరగడం, రుణ భారం తగ్గడం, మంచి పరిచయాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. పిల్లలు ఆశించిన విజయాలు సాధిస్తారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z