Devotional

17న తెరచుకోనున్న శబరిమల అయ్యప్ప దేవాలయం

17న తెరచుకోనున్న శబరిమల అయ్యప్ప దేవాలయం

దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం (Lord Ayyappa) వార్షిక వేడుకలకు సిద్ధమైంది. ఈ ఏడాది మండల మకరవిళక్కు వేడుకలు నవంబర్‌ 17 (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు నెలలపాటు కొనసాగే ఈ మహాదర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేరళ దేవాదాయశాఖ/దేవస్వం మంత్రి కే రాధాకృష్ణ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధునాతన సాంకేతికతను ఉపయోగించి అనేక ఏర్పాట్లు చేశామన్నారు.

సన్నిధానంలో భారీ రద్దీని నియంత్రించేందుకు డైనమిక్‌ క్యూ కంట్రోల్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని కేరళ మంత్రి వెల్లడించారు. నిలాక్కళ్, పంబా, సన్నిధానం ప్రాంతాల్లో వీడియో తెరలను ఏర్పాటు చేశామన్న ఆయన.. పంబా-సన్నిధానం మార్గంలోనే 15 చోట్ల అత్యవసర ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. శబరిమలలో ఆయా దేవాలయ బోర్డులు కల్పిస్తున్న వసతులను భక్తులకు తెలియజేయాలని సూచించారు. యాత్ర ఏర్పాట్లపై ఇప్పటివరకు ఆరుసార్లు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించామని, ఇందులో రెండుసార్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా పాల్గొన్నారని మంత్రి రాధాకృష్ణ వెల్లడించారు.

ఇదిలాఉంటే, మండల మకరవిళక్కు పండగ సీజన్‌లో ఏటా లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శిస్తుంటారు. మలయాళ నెల వృశ్చికం తొలి రోజున మండల మకరవిళక్కు వేడుకలు ప్రారంభమవుతాయి. జనవరి నెలలో మకర జ్యోతి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అయ్యప్ప ఆలయాన్ని మూసివేస్తారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z