ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా వద్ద న్యూదిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దిల్లీ నుంచి బిహార్‌లోని దర్భంగా వైపు వెళ్తున్న ప్రయాణికుల రైలులో మంటలు చెలరేగాయి. పలు బోగీల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
న్యూదిల్లీ-దర్భంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సరాయ్ భూపట్ స్టేషన్ దాటుతున్న సమయంలో స్లీపర్ కోచ్‌లో పొగలు రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించారు. వెంటనే రైలు సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో స్లీపర్ కోచ్ నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. ప్రమాదం గురించి తెలియగానే అనేకమంది ప్రయాణికులు భయంతో రైలు నుంచి కిందకు దూకేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైలులో మొత్తం మూడు కోచ్‌లలో మంటలు చెలరేగినట్లు సీనియర్ ఎస్పీ సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. ఈ ప్రమాదంలో కొందరికి గాయాలైనట్లు తెలిపారు. అంతేగానీ.. ఎలాంటి మరణాలూ సంభవించలేదని స్పష్టంచేశారు. ఈ రైలు తదుపరి సేవలు పునఃప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –