Devotional

నాగులచవితి విశిష్టత

నాగులచవితి విశిష్టత

కార్తీక మాసంలో శుక్ల పక్ష చవితినాడు నాగులచవితి పండుగగా జరుపుకుంటారు. పురాణాల్లో నాగ కులానికి ప్రత్యేక స్థానం ఉంది. విష్ణుమూర్తి నాగులను తన శయ్యగా మార్చుకున్నాడు. శివుడు నాగులను తన ఆభరణాలుగా చేసుకున్నాడు. విఘ్నేశ్వరుడు నాగులను తన యజ్ఞోపవీతంగా చేసుకున్నాడు. ఎనభై లక్షల జీవరాశుల్లో పాము ఒకటి. ఈ జాతి గాలిని ఆహారంగా తీసుకుని ఎక్కువ కాలం జీవిస్తుంది. నాగులు రజోస్వభావం కలిగినవి. వాటికి క్రోధం ఎక్కువ. మీరు చూసినా చూడకున్నా పాముల తోకపై తొక్కితే వెంటనే కాటేస్తుంది. అందుకే నాగులు అంటే విపరీతమైన భయం. విషసర్పాలను పూజిస్తే వాటికి భయం ఉండదని ప్రజల నమ్మకం. ఈ నమ్మకమే నాగారాధనకు కారణమని పండితులు చెబుతున్నారు.

లింగపురంలోని కథ:
అయితే.. లింగపురాణంలో నాగులు పుట్టుక గురించి ఒక కథ ఉంది. దీని కథ ఆధారంగా బ్రహ్మ సృష్టి చేద్దామని సంకల్పించుకుని మహాశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేయసాగాడు. అలా చాలాకాలం గడిచిపోయిన శివుడి అనుగ్రహం లభించలేదు. ఇక బ్రహ్మదేవుడికి అంతులేని ఆగ్రహం కలిగింది. దీంతో నేత్రాలు ఎర్రగా మారిపోయాయి. కాగా.. గట్టిగా కళ్ళు మూసుకునేటప్పటికి కళ్ళ నుండి కన్నీరు కారి కింద పడింది. ఆ.. కన్నీటి బిందువులే నాగులుగా మారాయి. ఇక సంతానానికి, సర్పపూజకు సంబంధం ఉందని బ్రహ్మపురాణంలో ఒక కథ ఉంది. ఇక పూర్వకాలంలో చంద్ర వంశానికి చెందిన శూరసేనుడు అను రాజు ఉండేవాడు. రాజధాని ప్రతిష్టానపురం. ఇక శ్రీమంతుడు, మతిమంతుడు అయిన ఆ రాజు సంతానం కోసం తన సతితో కలిసి పూజలు చేశారు.. వారి పూజలు ఫలించి తుదకు వారికి ఒక నాగం పుట్టింది..ఆ నాగమును వారు పెంచారు. ఆ నాగమునకు మనషుల వలే మాట్లాడగలిగే శక్తి ఉంది.

అయితే.. ఒకనాడు ఆ నాగం తండ్రిని తనకు ఉపనయనం గావించి వేదాభ్యాసం గావింపుమని ప్రార్థించింది. ఇక.. శూరసేన మహారాజు రహస్యంగా ఒక సద్రాహ్మణుని రప్పించి నాగము కోరినట్లు చేశాడు…మరికొంతకాలం గడిచిపోయిందన్నారు. కాగా.. నాగం తనకు వివాహం జరిపించమని అడిగింది. అయితే.. ఆ కోరికను విన్న రాజు విస్మితుడైనాడు. పూర్వదేశమును పరిపాలిస్తున్న విజయుడను భూపతి చెల్లెలు భోగవతి తగిన కన్యయని భావించి ఖడ్గాన్ని పంపించగా విజయుడు వీరస్థానమున ఆ ఖద్దము నుంచి భోగవతీ పరిణయము జరిపించాడు. ఇక సకల లాంఛనాలతో తన సోదరిని అత్తవారింటికి పంపించాడు. అయితే అత్తవారింటికి వచ్చిన తరువాత భోగవతికి తన భర్త ఒక సర్పమని అత్తగారి తెలుసుకుంది. దీంతో కంగారుపడక అత్తగారితో మాట్లాడుతూ.. సాధారణంగా మానవు, మానవతులకు మానవులే భర్తలు అవుతారు.

పరమేశ్వరుని శాపం:
ఇక నా పుణ్యవశాన నాకు దేవమూర్తి భర్తగా లభించాడు..తర్వాత భర్రయున్న గదిలోకి వెళ్ళింది భర్తను చూచి నాథా! నేను దేవపల్సినైతిని… నీచే నిట్లనుగ్రహింపబడి ధన్యురాలనయితిని అని పలికి నాగముతో కలసి విహరించసాగింది. అయితే.. కొంతకాలానికి ఆ నాగమునకు పూర్వజ్ఞానం కలిగింది.. ఒకనాటి రాత్రి ఆ నాగము తన సతి భోగవతిని అడిగింది. ఇక నేను నాగమును కదా! నన్ను చూచి నీవు ఎందుకు భయపడడం లేదు. కాగా.. అప్పుడు భోగవతి నాథా! దేవ వివాహితములగు సంఘటన తప్పించుకొనుట ఎవరి తరము. అయితే.. భర్త ఎటువంటి వాడైనా స్త్రీకి దైవసమానుడు… దైవసముణ్ణి చూచి భయపడడం దేనికి అని సమాధానమిచ్చింది. అయితే.. భార్య మాటలకు సంతోషించిన నాగము భోగవతితో ఇలా ఉన్నది. నాకు పూర్వ స్మృతి కలిగింది..నేను పరమేశ్చ్వరునిచే శపింపబడినవాడను.. ఇక శేషపుత్రుదైన నేను శివునికి ఆభరణముగానుంటిని అపుడు కూడా నీవేనా భార్యవు.

అయితే.. ఒకనాడు శివుడు పార్వతితో సరససల్లాపములాడుతూ నవ్వసాగాడు.. అతని సన్నిధానముననున్న నేనును భయం లేకుండా నవ్వసాగాను. అయితే.. అదిచూసి శివుడు కోపితుడై నన్ను మానవగర్భమున నాగమువై జన్మింపుమని శపించాడు. అయితే.. నేను జరిగిన తప్పిదమును మన్నించి శాపవిమోచనం కొరకు ప్రార్థించగా శివుడు కరుణించి నీవు నీ పత్నితో కలసి గౌతమి నదిలో స్నానమాచరించి నన్ను ప్రార్ధిస్తే నీకు శాపవిమోచనం కలుగుతుంది అని చెప్పి అనుగ్రహించాడు. నాగము తన సతి భోగవతితో కలసి గౌతమి నదిలో స్నానమాచరించి శివుడిని ఆరాధించాడు. దీంతో శివుడు ప్రసన్నుడై నాగమునకు దివ్యస్వరూపాన్ని ప్రసాదించాడు. తరువాత తల్లిదండ్రుల వద్దకు వచ్చి, జరిగిన వృత్తాంతమంతా తెలిపి శివలోకమునకు వెళ్ళుటకు అనుమతినివ్వమని ప్రార్ధించాడు…శూరసేన మహారాజు అంతా విని వత్సా! నీకు మాకు ఏకైక పుత్రుడివి… ఈ రాజ్యం నీది. నీవు రాజ్యపాలన గావింపుము.

అయితే.. మా తదనంతరము నీవు శివలోకమునకేగుము అని పలుకగా, నాగేశ్వరుడు తండ్రి మాటలకు తలొగ్గి రాజ్యపాలన గావిస్తూ పుత్రవంతుడై రాజ్యపాలన చేసి, అనంతర కాలంలో రాజ్యాన్ని పుత్రులకొసగి సతీసమేతంగా శివలోకానికి వెళ్ళాడు. దీంతో.. నాగము పడగ అదృష్టవంతులకు మాత్రమే లభిస్తుందని చెబుతుంటారు..తిమ్మరుసు కథ అందరికీ తెలిసిందే కదా! అని.. నాగుల మహిమ అనంతమైంది.. నాగులను అర్చించడం వల్ల సంతానాన్ని అభిలాషించే వారికి గర్భదోషములు తొలగిపోయి సత్సంతానం కలుగుతుంది. కాగా.. సంతతి ఉన్నవారికి అభివృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా నాగదోషములు తొలగిపోతాయి..ఎటువంటి అరిష్టాలు కలగవు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z