NRI-NRT

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే గల్ఫ్‌ కార్మికులకు కొత్త బీమా

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే గల్ఫ్‌ కార్మికులకు కొత్త బీమా

నిజామాబాద్‌ రూరల్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్(CM KCR) బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే గల్ఫ్‌ కార్మికులకు కూడా బీమా సదుపాయం(Gulf insurance) వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం సంతోషంగా ఉందని ఎన్నారై బీఆర్ఎస్‌ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్‌ అన్నారు. అరవై ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న గల్ఫ్ కార్మికులను గత పాలకులు ఏనాడు కూడా పటిచుకున్న పాపాన పోలేదని విమర్శించారు. బీమా సదుపాయంతో గల్ఫ్ బిడ్డల జీవితాల్లో కొత్త భరోసా కల్పిస్తుందన్నారు. కేసీఆర్ నిర్ణయంతో గల్ఫ్ కార్మికులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎన్నారైలు బీఆర్‌ఎస్‌ విజయం కోసం పని చేయాలన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z