Health

చామంతి పూలతో చేసిన టీ ఆరోగ్యానికి ఎంతో మేలు

చామంతి పూలతో చేసిన టీ ఆరోగ్యానికి ఎంతో మేలు

నిత్యం ప‌రిమితంగా టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాలు చేకూర‌తాయ‌ని ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయి. ఇక చామంతి పూల‌తో (Chamomile Tea) త‌యారుచేసే టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని, ముఖ్యంగా రాత్రి ప‌డుకునే ముందు ఈ టీ సేవిస్తే కంటినిండా కునుకు తీయ‌డంతో పాటు ఒత్తిడి మ‌టుమాయ‌మ‌వుతుంది.

చామంతి నుంచి త‌యార‌య్యే టీలో ఆరోగ్యానికి మేలు చేసే ప‌దార్ధాలున్నాయి. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కూ ఇది మెరుగ్గా ప‌నిచేస్తుంద‌ని రాత్రి ప‌డుకునే ముందు చామంతి టీని ఆస్వాదిస్తే ఆరోగ్యానికి గేమ్ ఛేంజ‌ర్‌గా ప‌నిచేస్తుంద‌ని న్యూట్రిష‌నిస్ట్‌, వెల్‌నెస్ ఎక్స్‌ప‌ర్ట్ అన్షుల్ జైభార‌త్ చెప్పారు.

కెఫీన్ ఉన్న పానీయాల‌తో పోలిస్తే చామంతి టీ ఒత్తిడిని దూరం చేసి, న‌రాల‌ను రిలాక్స్ చేస్తుంద‌ని స‌హ‌జ‌మైన సెడేటివ్‌గా పనిచేస్తుంద‌ని అన్షుల్ చెప్పుకొచ్చారు. చామంతి టీ నొప్పుల‌కు బామ్‌లా ప‌నిచేస్తుంద‌ని, ఆందోళ‌న, అల‌జ‌డిని మాయం చేస్తుంద‌ని, ద‌గ్గు, జ‌లుబుల‌ను ద‌రిచేర‌నివ్వ‌ద‌ని డైటీషియ‌న్లు చెబుతున్నారు. ఇక చామంతి టీతో జీర్ణ‌క్రియ కూడా మెరుగువుతంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z