Devotional

ఈ రాశికి ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు-రాశిఫలాలు

ఈ రాశికి ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు-రాశిఫలాలు

మేషం

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. సతీమణితో అన్యోన్యత పెరుగు తుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం

ఆర్థిక వ్యవహారాలు, ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. కొందరు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుంది. నిరుద్యోగులు తమకు అందిన అవకాశంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలలో సానుకూలత కనిపిస్తుంది. దూర ప్రాంతాలలో ఉంటున్న పిల్లలు చూడడానికి వచ్చే అవకాశం ఉంది.

మిథునం

ఈ రోజంతా సాదాసీదాగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబ జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూల స్పందన ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలను కొద్ది కాలం వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి.

కర్కాటకం

ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా ఆదరణ, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి ఊపం దుకుంటాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది.

సింహం

వృత్తి, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. నిరుద్యోగు లకు ఆశించిన ఉద్యోగాలకు ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. సొంత వ్యక్తులు స్వప్రయోజనాలకు వాడుకునే అవకాశం ఉంది. అనారోగ్య సూచ నలున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

కన్య

మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహ, వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది. ప్రముఖ వ్యక్తులు పరిచయం అవుతారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా వ్యవహరి స్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

తుల

వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఖర్చులు తగ్గించు కునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన పనుల మీద బాగా తిరగాల్సి వస్తుంది. నిరుద్యోగులు తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. బంధువులతో మాట పట్టింపులు రావచ్చు.

వృశ్చికం

వృత్తి, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలుంటాయి. దగ్గర బంధువులతో మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందడం, మొండి బాకీలు వసూలు కావడం, అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం కావడం వంటివి జరుగుతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు.

ధనుస్సు

ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగు తాయి. వృత్తి, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా, ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. వ్యాపా రంలో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబంతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.

మకరం

ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రాజెక్టులను చేపడతారు. దాదాపు అన్ని రంగాల వారికి కాలం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనారోగ్యం నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలను అమలు చేస్తారు. ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది.

కుంభం

ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సరికొత్త వ్యూహాలు, ప్రణాళికల కారణంగా వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. తలపెట్టిన వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికంగా ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త ప్రయత్నాలను, నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టడం మంచిది.

మీనం

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట బాగా చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది కానీ, తప్పనిసరిగా కొన్ని ఖర్చులు చేయాల్సి వస్తుంది. పిల్లల చదువుల్లో శుభవార్తలు వింటారు. సునాయాసంగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. కొత్త ప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు ఇది అనుకూల సమయం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z