హరియాణాలో పానీపత్‌లోని బాబర్‌పుర్‌కు చెందిన జానీ కుటుంబంలోని 150 మంది కాళ్లు లేదా చేతులకు ఆరేసి వేళ్లు కలిగి ప్రత్యేకత సంతరించుకున్నారు. ఇలా కాళ్లు లేదా చేతులకు ఆరేసి వేళ్లు ఉండడం వల్ల తమకు ఎలాంటి సమస్య అనిపించదని జానీ పేర్కొన్నాడు. అయితే చెప్పులు, షూస్ వేసుకునే సమయంలో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందని అన్నాడు. తన కుటుంబంలో కొంత మంది బాబర్‌పుర్‌లో.. మరికొందరు పానీపత్ పక్కనే ఉన్న నోహ్రా గ్రామంలో నివసిస్తున్నారని వివరించాడు. ఒకే కుటుంబంలో చాలా మంది ఆరు వేళ్లతో పుట్టడాన్ని వైద్య పరిభాషలో పాలీడాక్టిలీ అంటారని వైద్యాధికారి డాక్టర్ జైన్‌శ్రీ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –