Politics

ఒకే విమానంలో చంద్రబాబు రోజా

ఒకే విమానంలో చంద్రబాబు రోజా

తెదేపా అధినేత చంద్రబాబు రాకతో పార్టీ శ్రేణులతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాలు శుక్రవారం సందడిగా మారిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి చంద్రబాబు చేరుకున్న ఇండిగో విమానంలోనే మంత్రి రోజా కూడా వచ్చారు. విమానాశ్రయం బయటకు వచ్చే ప్రయాణికుల ద్వారా తెదేపా శ్రేణులు భారీగా ఉండడంతో ప్రత్యేక సెరెమోనియల్‌ లాంజ్‌ ద్వారా మంత్రి రోజాను పోలీసులు బయటకు పంపారు. విశాఖపట్నం విమానాశ్రయంలో జనసైనికులు ఉన్న సమయంలో మంత్రి రోజాను పంపడంతో తలెత్తిన సంఘటన పునరావృతం కాకుండా ప్రత్యేక లాంజ్‌ నుంచి మంత్రి రోజాను పంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు తిరుపతి సర్వీసు విమానాశ్రయం చేరుకొనే పది నిమిషాల ముందు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమానాశ్రయం చేరుకున్నారు. రోడ్డు మార్గంలో పవన్‌కల్యాణ్‌ మంగళగిరి తరలివెళ్లగా.. మంత్రి రోజా విజయవాడ బయలుదేరి వెళ్లారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z