ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2023 మెయిన్ పరీక్షల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఇంటర్వ్యూలకు మొత్తం 2,844 మంది అర్హత పొందారు. గత మే నెలలో జరిగిన ప్రాథమిక పరీక్షకు సుమారు 5.5 లక్షల మంది హాజరుకాగా.. అందులో 14,624 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. సెప్టెంబరు 15 నుంచి 24వ తేదీ వరకు మెయిన్ పరీక్షలు జరిగాయి. ఆ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. వచ్చే జనవరిలో మొదలయ్యే ఇంటర్వ్యూలకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 90 మంది వరకు ఎంపికయ్యారని అంచనా. గత ఏడాది ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 40 మంది వరకు సివిల్ సర్వీస్ కొలువులకు ఎంపికయ్యారు.
👉 – Please join our whatsapp channel here –