తానా 2023 ఎన్నికల్లో భాగంగా సతీష్ వేమూరి ప్యానెల్ అమెరికావ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తోంది. ఇందులో భాగంగా టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో, ఉత్తర కరోలినా రాష్త్రం ర్యాలెలో తన ప్యానెల్ సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రవాసులను కలుసుకుని తమ ప్యానెల్ గెలుపు అవసరాన్ని, ఆవశ్యకతను వివరించి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమాల్లో కొల్లా అశోక్, తూనుగుంట్ల శిరీష, నిరంజన్ శృంగవరపు, తాళ్లూరి జయశేఖర్, పుసులూరి సుమంత్, మాధవి ఏలూరి, ముత్యాల పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z