DailyDose

సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన కవిత- తాజా వార్తలు

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన కవిత- తాజా వార్తలు

* వైసీపీ బిగ్ స్కెచ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ రాజుకుంది. ఎలక్షన్లకు మరో మూడు నెలల సమయం ఉండగానే.. నేతలు ఇప్పటి నుండే విమర్శల బాణాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. అధికార వైసీపీ, టీడీపీ, జనసేన నేతల విమర్శలతో ఏపీ పొలిటికల్ వెదర్ వేడెక్కింది. ఈ క్రమంలో టీడీపీ కీలక నేత, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుపురం ఒక అద్దాల మేడ అని.. చిన్న రాయి వేసిన పగులుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై పోటీగా వైసీపీ నుండి ఈ సారి బీసీ మహిళను బరిలోకి దింపుతున్నామని పెద్దిరెడ్డి ప్రకటించారు. ఈ సారి హిందుపురంలో బాలకృష్ణ వర్సెస్ బీసీ మహిళ పోరు ఉంటుందని తేల్చి చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు. కాగా, టీడీపీ కంచుకోట అయిన హిందుపురంలో ఈ సారి ఎలాగైనా జెండా పాతాలని వైసీపీ మొదటి నుండి పక్కా ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగానే హిందుపురం నియోజకవర్గంలో అత్యధింగా ఉన్న బీసీ సామాజిక వర్గం నుండి.. మహిళను బరిలోకి దింపి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని ప్లాన్ చేస్తోంది. గత రెండు పర్యాయాలు హిందుపురం ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్యపై.. బీసీ మహిళ కార్డు ప్రయోగించి చెక్ పెట్టాలని వైసీపీ యోచిస్తోంది. వైసీపీ ప్లాన్ వర్కౌట్ అయితే.. ఈ సారి హిందుపురంలో బాలయ్యకు తిప్పలు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక, బాలయ్యపై పోటీగా వైసీపీ నుండి హిందుపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ టీ. దీపికను బరిలోకి దింపనున్నట్లు సమాచారం.

* బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన కవిత

బిల్కిస్ బానో(Bilkis Bano) కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు సుప్రీంకోర్టు(Supreem court) ఇచ్చిన తీర్పును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్వాగతించారు. ఈ మేరకు కవిత ‘ఎక్స్’ లో స్పందించారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. ఇలాంటి ప్రతి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుందనడానికి ఉదాహరణ అని అభప్రాయపడ్డారు. న్యాయం గెలిచిందని స్పష్టం చేశారు.కాగా, బిల్కిస్ బానో దోషులను ముందస్తు విడుదల విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, వాటిని రద్దు చేయాలని కోరుతూ గతేడాది మే నెలలో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన సంగతి తెలిసిందే.

* టీడీపీకి ఏపీ సీఈవో ఎంకే మీనా లేఖ

టీడీపీకి ఏపీ సీఈవో ఎంకే మీనా లేఖ రాశారు.. గత నెల 23వ తేదీన టీడీపీ ఇచ్చిన రిప్రజెంటేషన్‌పై తీసుకున్న చర్యలు వివరిస్తూ ప్రత్యుత్తరం రాశారు.. 2024 ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబరు 9 వరకూ వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించాం. డిసెంబరు 9 తేదీ తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా 2024 జనవరి 12 తేదీలోగా పరిష్కరిస్తాం. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించాం. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 14.48 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించాం. అందులో 5 లక్షల 64 వేల 819 పేర్లను అనర్హులుగా తేలింది. అన్ని జిల్లాల కలెక్టర్లూ ఆయా అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఓటర్లుగా ఆన్ లైన్ దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులూ వచ్చాయి. కాకినాడ నగరంలో ఫాం 7ల ద్వారా గంపగుత్తగా ఓటర్లను చేరుస్తున్న 13 మంది ఎఫ్ఐఆర్ ను నమోదు చేశాం. ఈ వ్యవహారంలో పోలీసు స్టేషన్లలో అభియోగపత్రాలు కూడా దాఖలు అయ్యాయని లేఖలో పేర్కొన్నారు.

* కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన హామీలను పకడ్భందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం నలుగురితో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చైర్మన్‌గా నియమించింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులను కమిటీ సభ్యులుగా అపాయింట్ చేసింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభయహస్తం పేరిట ఆరు గ్యారంటీల హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లోని సంక్షేమ పథకాల అమలు కోసం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ప్రజల వద్దకే వెళ్లి సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటిల్లో డిసెంబర్ 28వ తేదీన నుండి అప్లికేషన్లు స్వీకరించింది. ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 28వ తేదీ నుండి.. జనవరి 6వ తేదీ వరకు సాగిన దరఖాస్తుల స్వీకరణలో దాదాపు ఒక కోటి 25 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రాసెస్ చేపట్టారు. లబ్ధిదారుల ఫిల్టరింగ్ పూర్తి అయ్యాక.. ఈ పథకానికి అర్హులను గుర్తించి ప్రభుత్వం వారికి అందించనుంది.

* ముగిసిన నర్సరావుపేట పంచాయతీ

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో నర్సరావుపేట పంచాయతీ ముగిసింది. రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో సర్దుబాటు కసరత్తు చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఆయన వ్యతిరేక వర్గం వాదనలు విన్న విజయసాయిరెడ్డి.. ఇరువర్గాల మధ్య సర్దుబాటు చేశారాయన. అంతేకాకుండా.. పార్టీ విజయం కోసం పనిచేయాలని విజయసాయి రెడ్డి వారికి సూచించారు.

* త్వరలోనే దిల్లీ వెళ్లి స్పీకర్‌ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా!

తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తామని కలలో కూడా ఊహించలేదని విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ కేశినేని శ్వేత అన్నారు. కార్పొరేటర్‌ పదవికి శ్వేత సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను నగర మేయర్‌కు అందజేశారు. రాజీనామా ఆమోదం తర్వాత తెదేపాను వీడనున్నట్లు చెప్పారు.అనంతరం శ్వేత మాట్లాడుతూ.. ‘‘పార్టీని వీడాల్సి వస్తుందని నేను, ఎంపీ కేశినేని నాని ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే.. పార్టీ, అధినేత చంద్రబాబుపై మాకున్న అభిమానం, ప్రేమ అలాంటిది. కానీ ఈరోజు పార్టీయే మమ్మల్ని కాదనుకుంటోంది. అధినేతనే మమ్మల్ని వద్దనుకుంటున్నారు. ఒక సిట్టింగ్‌ ఎంపీ అయిన కేశినేని నానికి.. విజయవాడ ప్రాంతంలో జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దని సమాచారం వచ్చింది. ఇంత జరిగిన తర్వాత పార్టీలో ఉండడం సరైంది కాదని మేం భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మేం ఎవరినీ తప్పుబట్టడం లేదు. పార్టీ కోసం అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు’’ అని అన్నారు.తెలుగుదేశం పార్టీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘తెదేపాకు నా అవసరం లేదని అధినేత చంద్రబాబు భావించిన తరువాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్‌ కాదని నా భావన. కాబట్టి త్వరలోనే దిల్లీ వెళ్లి స్పీకర్‌ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. దాన్ని ఆమోదించిన మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా’’ అని ఈ నెల 6న ఎక్స్‌లో నాని పేర్కొన్నారు.

* సుప్రీం తీర్పును స్వాగ‌తించిన రాహుల్

బిల్కిస్‌ బానో (Bilkis Bano Case) లైంగిక దాడి కేసులో 11 మంది దోషులను విడుద‌ల చేయాల‌ని గుజ‌రాత్ ప్ర‌భుత్వం ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి క్ష‌మాభిక్ష ప్ర‌సాదించే అధికారం లేద‌ని స్ప‌ష్టం చేసింది. స‌ర్వోన్న‌త న్యాయ‌స్ధానం తీర్పును విప‌క్ష పార్టీలు స్వాగ‌తించాయి. ఇది న్యాయం సాధించిన విజ‌య‌మ‌ని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కాషాయ పార్టీ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.నేర‌స్తుల‌ను కాపాడేందుకు బీజేపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను రాహుల్ ఎండ‌గ‌ట్టారు. అహంకారపూరిత బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బిల్కిస్‌ బానో చేసిన సుదీర్ఘ పోరాటానికి ఫ‌లితంగా న్యాయం గెలిచింద‌నేందుకు ఈ తీర్పు సంకేత‌మ‌ని రాహుల్ ఎక్స్ వేదిక‌గా రాసుకొచ్చారు. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకు న్యాయానికి పాత‌రేయ‌డం ప్ర‌జాస్వామిక వ్య‌వ‌స్ధ‌లో ప్ర‌మాద‌క‌ర పోక‌డ‌ని వ్యాఖ్యానించారు.నేర‌గాళ్ల‌ను పోషిస్తున్న‌దెవ‌రో సుప్రీంకోర్టు నిర్ణ‌యం మ‌రోసారి దేశానికి చాటిచెప్పింద‌ని రాహుల్ పేర్కొన్నారు. చివ‌రికి న్యాయం నెగ్గింద‌ని సుప్రీం తీర్పును స్వాగ‌తిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో న్యాయ వ్య‌వ‌స్ధ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో విశ్వాసం మ‌రింత పెరిగింద‌ని, బిల్కిస్‌ బానో పోరాటం కొన‌సాగించినందుకు అభినంద‌న‌ల‌ని ప్రియాంక సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z