Movies

రికార్డు సృష్టించిన ‘‘12th ఫెయిల్‌’’

రికార్డు సృష్టించిన ‘‘12th ఫెయిల్‌’’

విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్‌ మస్సే ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘12th ఫెయిల్‌’(12th Fail). విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం అరుదైన ఘనత సాధించింది. ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ)లో అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ సినిమాగా రికార్డు నెలకొల్పింది. గతేడాది విడుదలైన హాలీవుడ్‌ చిత్రాలకంటే దీని రేటింగ్ ఎక్కువ ఉండడం విశేషం. తాజాగా గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల్లో సత్తా చాటిన ‘ఓపెన్‌హైమర్‌’ (8.4), బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ‘స్పైడర్ మ్యాన్‌: అక్రాస్‌ది స్పైడర్‌ వెర్స్‌’ (8.6) సినిమాల రేటింగ్స్‌ను దాటి ‘12th ఫెయిల్‌’ 9.2 సాధించింది.

ఈ సినిమా విషయానికొస్తే.. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందింది. 12వ తరగతి ఫెయిల్‌ అయిన యువకుడు.. ఐపీఎస్‌ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు పోటీపడనుంది. జనరల్‌ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా చిత్రబృందం నామినేషన్‌ వేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z