DailyDose

జ్యోతిష్యం నమ్మొద్దన్న భర్త- నేర వార్తలు

జ్యోతిష్యం నమ్మొద్దన్న భర్త- నేర వార్తలు

* కన్నతల్లినే కిరాతకంగా చంపిన కొడుకు

ఈ భూమిపై వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. నిస్వార్థ ప్రేమ తల్లి మాత్రమే. ఆ మాతృమూర్తి.. తన పిల్లలను ఏ కష్టం లేకుండా పెంచి పెద్ద చేస్తుంది. కన్న తల్లి ప్రేమను మర్చి.. దారుణానికి ఓడిగడుతున్నారు. కొందరైతే.. డబ్బు కోసం తల్లులను హత్య చేస్తున్నారు. మరికొందరు డబ్బు కోసం కొడుకుల తల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేస్తూ నరకం చూపిస్తున్నారు. ఇక.. చిన్నప్పటి నుంచి తనకు సేవ చేసిన తల్లి వృద్ధాప్యంలో సేవ చేయడం మానేసి.. దారుణంగా హత్య చేసిన ఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయా అనే సందేహం కలుగుతోంది. ప్రాణాలను పణంగా పెట్టి ప్రసవించిన తల్లిపై కొందరు కొడుకులు దాడి చేస్తున్నారు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్-కేశంపేటలో జరిగింది.షాద్ నగర్‌లో సుగుణమ్మ అనే మహిళ నివసిస్తోంది. స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు శివకుమార్ అనే కుమారుడు ఉన్నాడు. డబ్బుల కోసం తల్లిని..శివకుమార్‌ను తరచూ వేధించేవాడు. అదేవిధంగా ఆదివారం రాత్రి కూడా రూ.20 డబ్బుల కోసం శివకుమార్ తల్లి సుగుణమ్మతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కొడుకు విచక్షణ సహనం కోల్పోయి తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో తల్లిపై దాడికి పాల్పడ్డాడు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అక్కడే వున్న వారు వద్దు ఆమె నీకు తల్లి తనపై అలా దురుసుగా ప్రవర్తించడం సరికాదని చెబుతున్నా.. శివకుమార్ చెవిన వేసుకోలేదు. కొడుకు ఆమెను దారుణంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను తన చీరతోనే మెడకు గట్టిగా బిగించాడు. ఊపిరి ఆడకుండా చేశాడు. దీంతో ఆమె సృహ కోల్పోయింది. అయితే తెల్లవారుజామున సుగుణమ్మ మృతి చెందింది. ఇది చూసిన నిందితుడు తన తల్లి అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

* భర్తను హత్యచేసిన భార్య

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ (Instagram Reels) చేయనివ్వడం లేదని కక్ష పెంచుకున్న భార్య తన భర్తను పక్కా ప్రణాళికతో హత్య చేసింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లతో కలిసి గొంతుకోసి చంపేసింది. ఈ ఘటన బిహార్‌లోని (Bihar) బెగుసరాయ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహేశ్వర్‌ కుమార్‌ రాయ్‌ (25), రాణి కుమారి భార్యాభర్తలు. అతడు కోల్‌కతాలో దినసరి కూలీగా పని చేసేవాడు. ఇటీవలే స్వగ్రామానికి వచ్చారు. భార్య సోషల్‌ మీడియా రీల్స్‌ చేయడం అతడికి నచ్చలేదు. వద్దని వారించడంతో, వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.పథకం ప్రకారం భర్తను ఆమె పుట్టింటికి తీసుకెళ్లిన రాణి.. తన ఇద్దరు అక్కాచెల్లెళ్లతో కలిసి హత్య చేసింది. కొద్దిసేపటి తర్వాత మృతుడి సోదరుడు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో, అనుమానం వచ్చి తండ్రిని పంపించాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* జ్యోతిష్యం నమ్మొద్దన్న భర్త

కొంతమందికి జ్యోతిష్యం అంటే పిచ్చిగా నమ్ముతారు. అలా నమ్మేవారికి నక్షత్రాలు, తిధులు, గ్రహాలు వంటి ప్రతిదానిపై వారికి విశ్వాసం ఎక్కువగానే ఉంటుంది. జ్యోతిష్యంలో చెప్పినవి అన్నీ నిజ జీవితంలో జరుగుతాయని బలంగా నమ్మేస్తారు. జ్యోతిష్యులు ఏం చెబితే అదే జరగుతుందని నమ్మేస్తారు. అయితే ఓ యూట్యూబ్ ఛానల్ లో రోజూ జ్యోతిష్యం గురించి విన్న ఆ గృహినికి నీ భర్తకు నువ్వు దూరం అవుతావని చెప్పడంతో ఆందోళనకు గురైంది. ఈ విషయం పదే పదే భర్తకు చెప్పడంతో కోపంతో రగిలిపోయిన భర్త జ్యోతిష్యం గుడ్డిగా నమ్మవద్దని వాదించిన వినలేదని ఆమెపై చెయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమో చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అంబర్ పేట్ లో చోటుచేసుకుంది.హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన బబిత(28)కు బలరాంకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి రామకృష్ణతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. బబిత, రామకృష్ణ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొడుకు పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఇంట్లో ఘనంగా జరిగాయి. బంధువులందరూ వేడుకకు హాజరయ్యారు. బబిత తల్లిదండ్రులతో గొడవల కారణంగా వారు గైర్హాజరయ్యారు. సోమవారం ఉదయం భర్త ఆఫీసుకు వెళ్లాడు. రెండు గంటల తర్వాత అంగన్‌వాడీ కేంద్రం నుంచి వచ్చిన చిన్నారి ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న తల్లిని చూసి దిగువ పోర్షన్‌లో ఉంటున్న బాబాయికి చెప్పింది. పైకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.కిందకు దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమార్తె మృతి చెందిన విషయం తెలుసుకున్న బబిత తల్లిదండ్రులు రామకృష్ణపై దాడి చేశారు. అదనపు కట్నం వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అలాంటిదేమీ లేదని.. జ్యోతిష్యంపై నమ్మకం వద్దని బబితను రామకృష్ణ పదే పదే కోరినట్లు అత్తమామలు తెలిపారు. దీనిపై ఇటీవల గొడవ జరిగిందన్నారు. సహనం కోల్పోయిన రామకృష్ణ ఆమెను అందరి ముందు కొట్టాడు. దాంతో బబిత ఆత్మహత్య చేసుకుని ఉంటుందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

* విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెంకటరావుపేట వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంతో హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఘట్‌కేసర్‌ నుంచి జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రాఘవపేటలోని ఓ బంకుకు డీజిల్‌ తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

* నిద్రమత్తులో చెట్టును ఢీకొట్టిన లారీ

నిద్రమత్తులో ఓ లారీ చెట్టును వేగంగా ఢీకొట్టడంతో లారీ డ్రైవర్​ అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన రూరల్​ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం ఏలూరు జిల్లా నవాబుపేట నుంచి మంగళవారం తెల్లవారుజామున చేపల లోడ్​ను ఉత్తరప్రదేశ్​ రాష్ట్రం ఘోరక్​పూర్​ తరలిస్తున్నారు. లారీని క్లీనర్​ తానికొండ నరేష్​కుమార్​ నడుపుతుండగా మార్గమధ్యలో రూరల్​ మండలం ఆరెంపుల గ్రామ శివారు దాటగానే మంగళవారం తెల్లవారుజామున లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే భారీ వృక్షాన్ని ఢీకొట్టింది.ఈ ఘటనలో లారీ పల్టీ కొట్టడం తో పాటు డ్రైవర్​ చేపల లోడ్​ కింద పడ్డాడు. క్లీనర్ ​ నరేష్​కుమార్​ దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. డ్రైవర్​ బాల బాలరాజు చేపల లోడ్​ కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న రూరల్​ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎస్కార్ట్​ల సహాయంతో శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ వీ. సురేష్​ తెలిపారు. మృతుడు డ్రైవర్​కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.

* ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్నిప్రమాదం సభవించింది (Fire breaks). నరేలా ప్రాంతంలోని (Narela area) ఓ ఫ్యాక్టరీ (factory)లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో సమీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z