🌹అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ… వారం రోజుల్లో ఏ రోజు ఏమి జరుగనుంది..?🌹
రామ జన్మభూమి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 16వ తేదీతో ప్రారంభమై వారం రోజుల పాటు జరిపేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో ఈ ఉత్సవ సంబరం పతాక స్థాయికి చేరుతుంది.
వారం రోజుల పాటు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లోకి వెళ్తే…
జనవరి 16:
టెంపుల్ ట్రస్ట్ శ్రీరామ్ జన్మభూమి క్షేత్ర ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త వేడుక (Atonement ceremony) జరుగుతుంది. సరయూ నది ఒడ్డున విష్ణుదేవుని ఆరాధన, గోపూజ నిర్వహిస్తారు.
జనవరి 17:
ఆలయంలో ప్రతిష్ఠించనున్న బాల రాముని విగ్రహాన్ని ఊరేగింపుతో అయోధ్యకు తీసుకువస్తారు. మంగళ కలశాలతో సరయూ నది పవిత్ర జలాలు రామజన్మభూమి ఆలయానికి చేరుకుంటాయి.
జనవరి 18:
గణపతి, అంబికా పూజ, వరుణ పూజ, మాత్రిక పూజ, బ్రాహ్మిణ్ వరన్, వాస్తు పూజతో పూజదికాలు మొదలవుతాయి.
జనవరి 19:
హోమగుండం వెలిగిస్తారు. నవగ్రహ, హవన్ పూజ నిర్వహిస్తారు.
జనవరి 20:
సరయూ నదీ జలాలతో రామజన్మభూమి ఆలయ గర్భగుడిని కడిగి శుభ్రం చేస్తారు. అనంతరం వాస్తు శాంతి, అన్నదివస్ రిట్యువల్స్ జరుగుతాయి.
జనవరి 21:
శ్రీరాముని విగ్రహానికి 125 కలశాలతో పవిత్ర స్నానం చేయిస్తారు.
జనవరి 22:
ఉత్సవాల చివరి రోజు ప్రభాత సేవ జరుగుంతుంది. మధ్యాహ్నం రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనతో ఉత్సవ సంబరాలు పతాక స్థాయికి చేరుతాయి.
జై శ్రీరామ్
🙏🚩🙏 🚩🙏🚩 🙏🚩🙏
➖➖➖ ➖➖➖ ➖➖➖
👉 – Please join our whatsapp channel here –