హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఐటీఐ విద్యార్హతతో కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 1100 జూనియర్ టెక్నీషియన్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన వారు జనవరి 16న సాయంత్రం 4గంటల వరకు ఆన్‌లైన్ https://www.ecil.co.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈ ఒప్పందం నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్రాజెక్టు అవసరాలు, అభ్యర్థుల పనితీరును బట్టి మరో రెండు మాసాల పాటు పొడిగించే అవకాశం ఉంటుంది.
నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..
మొత్తం పోస్టుల్లో ఎలక్ట్రానిక్ మెకానిక్ 275; ఎలక్ట్రీషియన్ 275; ఫిట్టర్ 550 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితి జనవరి 16, 2024 నాటికి 30 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ ఆధారంగా వయో సడలింపు కల్పించారు.
నెలకు వేతనం రూ.22,528 చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ ఇన్సూరెన్స్, కంపెనీ పీఎఫ్, టీ/డీఏతో పాటు పెయిడ్‌లీవ్ వంటి సౌకర్యాలు ఉంటాయి.
విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఏడాది అప్రెంటిస్‌షిప్; ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థుల్ని ట్రేడ్‌ల వారీగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. డాక్యుమెంట్‌వెరఫికేషన్ తేదీ, సమయాన్ని వెబ్‌సైట్‌లో ఆ తర్వాత పొందుపరుస్తారు.
👉 – Please join our whatsapp channel here –